‘ది కేరళ స్టోరీ’ని ఆ సీరిస్ ఆధారంగా చేసారా? కాపీనా? ?

Published : May 08, 2023, 12:26 PM IST
 ‘ది కేరళ స్టోరీ’ని ఆ సీరిస్ ఆధారంగా చేసారా? కాపీనా? ?

సారాంశం

ఈ సీరిస్  కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూ జరుగుతుంది. ఐసిస్ తీవ్రవాదుల ఉచ్చులో పడి ఇబ్బందులు పడ్డ అమ్మాయిల  వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 


  అదాశర్మ తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’  సినిమా మొన్న శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా కేరళలో (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు  ఆరోపణలు ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్. ఇక ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కలెక్షన్స్ కూడా వీకెండ్ లో బాగుండటంతో టీమ్ ఆనందంలో ఉంది.  అయితే కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో ఓ షో ఆధారంగా తీసారంటూ వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. వివరాల్లోకి వెళితే..

 2020  లో  'Caliphate' టైటిల్ తో  స్వీడిష్ వెబ్ సిరీస్ ఒకటి  నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో సాగే ఈ ఎపిసోడ్ బాగానే వర్కవుట్ అయ్యింది.  సుమారు ఏడు గంటల లెంగ్త్ తో స్ట్రీమింగ్ అయ్యే ఈ సీరిస్ కూడా దాదాపు ఇలాంటి కంటెంట్ తోనే సాగుతుంది.ఈ సీరిస్  కూడా బ్రెయిన్ వాష్ కు గురైన నలుగురు అమ్మాయిల చుట్టూ జరుగుతుంది. ఐసిస్ తీవ్రవాదుల ఉచ్చులో పడి ఇబ్బందులు పడ్డ అమ్మాయిల  వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సీరిస్ బ్యాక్ డ్రాప్ యూరోప్ లో  ఉంటుంది. దాన్ని తీసుకునే మన ఇండియన్ వెర్షన్ కు మార్చి.. కేరళ నుంచి సిరియా అన్నట్టుగా చూపించారని చెప్తున్నారు.  అయితే ఇందులో నిజమెంత అనేది ఆ సీరిస్ చూసిన వాళ్లు మాత్రమే చెప్పగలరు. ఆ సీరిస్ చూసి ప్రేరణ పొందారా లేదా అన్నది అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

ఇక కేరళ తమిళనాడు మల్టీప్లెక్సుల్లో ఇప్పటికీ దీన్ని బ్యాన్ చేశారు. రిలీజ్ కు ముందు దేశవ్యాప్తంగా రిలీజ్ విషయంలో కూడా ఎన్నో సమస్యలు  ఏర్పడ్డాయి. అలాగే  సినిమాని ఆపాలని కోర్టు ద్వారా ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో చిత్ర యూనిట్ హైకోర్టుకు వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇక మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ చిత్రం  తమిళనాడు మల్టిప్లెక్స్ లలో మాత్రం బ్యాన్ ని ఎదుర్కొంది. ఈ రోజు(ఆదివారం) నుంచి తమిళయనాడు మల్టిప్లెక్స్ అశోషియేషన్ వారు ఈ సినిమాని బాయ్ కాట్ చేసారు. తమిళనాడు మీడియా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. లా అండ్ ఆర్డర్ సమస్యలు రావటం, పబ్లిక్ నుంచి సరైన ఆదరణ దక్కకపోవటంతో సినిమాని వద్దనుకున్నట్లు తెలియచేసారు.    

అలాగే కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలు ఇస్లాంలోకి మార్చబడ్డారని, ఇందులో కొంతమంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, ఐసిస్ పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొందరు ఐసిస్ పోరాటానికి మద్దతుగా సిరియా వెళ్లిన ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సినిమాను తప్పుపట్టారు. 32 వేల మంది మతం మారినట్లు రుజువు చేస్తే రూ.1 కోటి ఇస్తామని ముస్లిం సంస్థ ఛాలెంజ్ చేసింది.  సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ .. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే