Prabhas Look : ‘కల్కి’ టీమ్ తో నెట్ ఫ్లిక్స్ సీఈవో... ప్రభాస్ న్యూ లుక్ చూశారా.! వైరల్ గా మారిన పిక్

Published : Dec 09, 2023, 02:30 PM ISTUpdated : Dec 09, 2023, 02:56 PM IST
Prabhas Look :  ‘కల్కి’ టీమ్ తో నెట్ ఫ్లిక్స్ సీఈవో... ప్రభాస్ న్యూ లుక్ చూశారా.! వైరల్ గా మారిన పిక్

సారాంశం

నెట్ ఫ్లిక్స్ సీఈవో, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ (Netflix Ceo Ted Sarandos)  హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ప్రత్యేకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కలిశారు. 

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ (Netflix Ceo)  మూడు రోజులుగా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు టీమ్ మోనిక షెర్గిల్, తదితరులు ఉన్నారు. ట్విన్ సిటీలో పర్యటిస్తున్న సందర్భంగా సరండోస్ టాలీవుడ్ టాప్ స్టార్లను ప్రత్యేకంగా కలుస్తున్నారు. తొలుత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో భేటీ అయ్యారు. చిరు, చరణ్, తేజూ, వైష్ణవ్ వారికి వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు. తాజాగా మహేశ్ బాబును కూడా కలిసి భేటీ అయ్యారు. 

ఈ క్రమంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ను కూడా కలిశారు. సలార్ రిలీజ్ ముందు డార్లింగ్ ‘కల్కి’ షూటింగ్ లో ఉన్నట్టు నెట్ ఫ్లిక్స్ సీఈవో సరండోస్ పంచుకున్న ఫొటోతో తెలుస్తోంది. డార్లింగ్ తోనూ సరండోస్ ముఖ్యమైన విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఆ ఫొటోను తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు  #TedSarandos ను అతని ప్రతిభావంతులైన బృందం #MonikaShergill #AbhishekGoradiaని కలవడం చాలా సంతోషంగా ఉందని  మేకర్స్ వైజయంతి బ్యానర్ తెలిపింది. ప్రస్తుతం జరిగిన భేటీలో ఫ్యూచర్లో ఎంటర్ టైన్ మెంట్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొందన్నారు. ఈ సందర్భంగా టీమ్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. 

నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ప్రభాస్ ను ప్రత్యేకంగా కలవడం ఓ విషయమైతే.. తను పంచుకున్న ఫొటోతో ప్రభాస్ న్యూ లుక్ అభిమానులకు ట్రీట్ గా మారింది. డార్లింగ్ మాసీవ్ లుక్ అదిరిపోయింది. గడ్డం, మీసాలు, పొడవాటి జుట్టుతోఆకట్టుకుంటున్నారు. కల్కి షూటింగ్ కు సంబంధించిన లుక్ గా తెలుస్తోంది. అయితే డార్లింగ్ Salaar Cease Fire  ప్రమోషన్స్ కు ముందుకు కల్కి టీమ్ తో జాయిన్ అయ్యారనేది స్పష్టం అవుతోంది. 

సలార్ నుంచి మరో ట్రైలర్ విడుదల తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ కూడా Kalki 2898 ADని త్వరగానే ఫినిష్ చేస్తున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ సీఈవో గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో విడివిడిగా ఓ సిరీస్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్స్ ను ప్రత్యేకంగా మీట్ అవుతుండటంతో ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?