#Netflix కు వరుణ్ తేజ్ పెళ్లి వీడియో, ఎంతకు అమ్మారంటే?

 వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్‌ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు ...

Google News Follow Us

ఓటిటిలో సెలబ్రెటీల పెళ్లి వేడుకలు రావటం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యిన ట్రెండ్. ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ చాలా మంది హీరో,హీరోయిన్స్ తమ పెళ్లి కు ముందే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికు అయ్యిన ఖర్చు గ్రాండ్ గా రికవరీ చేయవచ్చు అనేది వారి ఆలోచన. అదే సమయంలో అభిమానులు చక్కగా ఈ పెళ్లిని తమ ఇంట్లో కూర్చుని వీక్షించవచ్చు. కాగా.. గతంలోనూ హన్సిక, నయనతార తమ పెళ్లి వీడియోలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

అదే క్రమంలో మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి వీడియోను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం హక్కలు ఇచ్చేసినట్లు  తెలుస్తోంది. వీరిద్దరి గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకను అభిమానులందరూ చూసేలా ఓటీటీలోకి రానుంది. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మరి ఎంతకు ఈ రైట్స్ ని నెట్ ప్లిక్స్ తీసుకుందీ అంటే.... ఈ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ను దాదాపు రూ.8 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.  అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
 
 వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్ళి  ఇటలీలోని టస్కనీలో నవంబర్ 1న అంగరంగవైభవంగా జరిగింది.  వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ పాటుగా, నితిన్, అల్లు అర్జున్, మరికొంతమంది సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్‌ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.వరుణ్- లావణ్య హైదరాబాద్ తిరిగొచ్చాక, ఇచ్చిన రిసెప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా వచ్చి, వధూవరులను అభినందించారు. ఇటలీలో జరిగిన వరుణ్- లావణ్య వివాహానికి సంబంధించిన వీడియో ను మనం అతి త్వరలో నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు అన్నమాట.