క్లాస్ లో నా ప్రక్కన కూర్చున్న డయానా సూపర్ స్టార్ నయనతార అవుతుందని కల్లోకూడా అనుకోలేదు

Published : Nov 20, 2020, 11:21 PM ISTUpdated : Nov 20, 2020, 11:24 PM IST
క్లాస్ లో నా ప్రక్కన కూర్చున్న డయానా సూపర్ స్టార్ నయనతార అవుతుందని కల్లోకూడా అనుకోలేదు

సారాంశం

కేరళలోని మార్తోమా డిగ్రీ కాలేజీలో నయనతార 2002-05లలో బీఏ ఇంగ్లీష్ చేశారట. ఆ సమయంలో ఇంగ్లీష్ భాషపై నయనతార రాసిన ఒక వ్యాసాన్ని కూడా ఆయన ఆ పోస్ట్ లో జత చేశారు. స్వయంగా నయనతార రాసిన ఆ ప్రతిని మహేష్ భార్య ఏళ్లుగా దాచి ఉన్నారట. దానికి భార్యకు కూడా కృతజ్ఞలు తెలిపారు మహేష్.     

ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేం. రేపు ఏమి జరుగుతుందో చెప్పలేని మనం, కొన్నాళ్ల తరువాత మన సన్నిహితులు, మిత్రులు ఎలా ఉంటారో, ఏమి చేస్తారో ఊహించడం కష్టమే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార గురించి ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆమె క్లాస్ మేట్ మహేష్ కదమ్మనిట్ట. 

నయనతార పుట్టినరోజు పురస్కరించుకొని మహేష్ అరుదైన సందేశంతో కూడిన ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో మహేష్... డిగ్రీలో తన పక్కన కూర్చున్న తన స్నేహితురాలు సూపర్‌ స్టార్‌ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. ముఖ‍్యంగా పురుషాధిపత్యం, నెపోటిజం పరిశ్రమను ఏలుతున్న తరుణంలో సినిమా నేపథ్యం ఏ మాత్రం లేని ఒక మహిళ తన కాళ్ళ మీద తను గట్టిగా నిలబడటం ఆశ్చర్యం.  కరియర్‌ ఆరంభంలో  అభిమానుల కంటే  విమర్శలే ఎక్కువ. అయినా వాటన్నింటినీ తట్టుకుని  మొత్తం  సినిమా ప్రపంచాన్ని ఏలే  శక్తిగా ఎదుగుతుందని ఎవరూ  ఊహించి ఉండరు. కానీ పరిశ్రమ మీద  గౌరవంతో  విమర్శలన్నింటినీ అధిగమించింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే  ఆమె విజయతీరాలకు చేరింది’’.  17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం  అద్భుతం  తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి, కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్‌ డయానా నీకు  వేల  పుట్టిన రోజు శుభాకాంక్షలు'' పొందుపరిచారు. 

కేరళలోని మార్తోమా డిగ్రీ కాలేజీలో నయనతార 2002-05లలో బీఏ ఇంగ్లీష్ చేశారట. ఆ సమయంలో ఇంగ్లీష్ భాషపై నయనతార రాసిన ఒక వ్యాసాన్ని కూడా ఆయన ఆ పోస్ట్ లో జత చేశారు. స్వయంగా నయనతార రాసిన ఆ ప్రతిని మహేష్ భార్య ఏళ్లుగా దాచి ఉన్నారట. దానికి భార్యకు కూడా కృతజ్ఞలు తెలిపారు మహేష్.   

ഡിഗ്രി ക്ലാസിൽ (Marthoma College, 2002-2005 English Literature) ഒപ്പമിരുന്നു പഠിച്ച കൂട്ടുകാരി ഇന്ന് തെന്നിന്ത്യയിലെ...

Posted by Mahesh Kadammanitta on Wednesday, 18 November 2020

PREV
click me!

Recommended Stories

కళ్యాణ్ పడాల విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా, కథ మొత్తం నడిపించింది ఆమెనే.. అగ్గిపుల్ల వెలిగించి మరీ
చిరంజీవి తన భార్య సురేఖకు నేర్పించిన రెండు స్పెషల్ వంటలు ఏంటో తెలుసా? అల్లు వారిపై మెగాస్టార్ ఫన్నీ కౌంటర్