‘దసరా’ టీజర్ వచ్చేసింది.. నాని ఊరమాస్ అవతార్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Published : Jan 30, 2023, 05:17 PM ISTUpdated : Jan 30, 2023, 05:18 PM IST
‘దసరా’ టీజర్ వచ్చేసింది.. నాని ఊరమాస్ అవతార్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

సారాంశం

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దసరా’ టీజర్ వచ్చేసింది. ఊరమాస్ లుక్, డైలాగ్స్ తో దుమ్ములేపుతోంది. నాని ఫ్యాన్స్ కు నెవర్ బిఫోర్ మాస్ ట్రీట్ రెడీ అవుతోంది.   

ఊరమాస్ లుక్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్న తొలిపాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). రిలీజ్ కు సిద్ధం  అవుతున్న తరుణంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన  పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ తరహా చిత్రం నాని చేయడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా దుమ్ములేచిపోయే టీజర్ ను వదిలారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గోదావరిఖిని సమీపంలోని వీర్లపలిలో ఉన్న గ్రామంలో నాని నివసిస్తుంటాడు. ఆ ప్రజల సంప్రదాయాలు,  అక్కడి దుష్టశక్తులను పరిచయం చేశారు. నాని ఊరమాస్ లుక్, బొగ్గుగనుల్లో ఇమిడిపోయినట్టు కనిపించే ప్రవర్తన, కరీంనగర్ యాస, భాష, మాస్ లోకేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని ఊరమాస్ అవతార్ కు నాని ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పొచ్చు. టీజర్ కు అందించిన బీజీఎం అదిరిపోయింది. 

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తోంది. ‘నేను లోకల్’ తర్వాత మరోసారి ఈ జోడీ వెండితెరపై అలరించబోతోంది. మార్చి30న  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్ తో అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకా చకా కొనసాగుతున్నాయి.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ విడుదల చేశారు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్