
`నారప్ప` ఫేమ్ కార్తీక్ రత్నం(Karthik Ratnam) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. శనివారం కార్తీక్ రత్నం నిశ్చితార్థం జరిగ్గా ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఎంగేజ్‌మెంట్‌కి కార్తీక్ రత్నంతోపాటు ఆయన చేసుకోబోయే అమ్మాయి తరఫు బంధువులు, పలువురు సినిమా ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నవీన్ చంద్ర ప్రముఖంగా ఉన్నారు. వీరిద్దరు కలిసి `అర్థశతాబ్దం` చిత్రంలో నటించారు.
ఇదిలా ఉంటే కార్తీక్ రత్నం చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక `కేరాఫ్ కంచెరపాలెం` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు కార్తీక్ రత్నం. ఇందులో సహజమైన యాక్టింగ్‌తో ఆదరగొట్టాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. `గాడ్స్ ఆఫ్ ధర్మపురి`, `చెక్`, `అర్థ శతాబ్దం`, `నారప్ప`, `రౌడీబాయ్స్` చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. `నారప్ప` చిత్రంలో కార్తీక్ నటించిన మునికన్న పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.
ప్రస్తుతం కార్తీక్ రత్నం అటు కీలక పాత్రలకు, ఇటు వెబ్ సిరీస్ మూవీస్‌కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు.