Hai Nanna Teaser : ఎమోషనల్ గా ‘హాయ్ నాన్న’ టీజర్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసిన నాని

Published : Oct 15, 2023, 12:48 PM ISTUpdated : Oct 15, 2023, 12:54 PM IST
Hai Nanna Teaser : ఎమోషనల్ గా ‘హాయ్ నాన్న’ టీజర్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసిన నాని

సారాంశం

నాని - మృణాల్ ఠాకూర్ జంటగా ‘హాయ్ నాన్న’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎమోషనల్ అంశాలతో టీజర్ ను విడుదల చేశారు. ఇక రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది యూనిట్.  

నేచురల్ స్టార్ నాని (Nani)  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. రోటీన్ భిన్నంగా కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. చివరిగా ‘దసరా’ రా అండ్ రగ్డ్ లుక్ తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశారు. ఏకంగా వంద కోట్ల వరకు వసూళ్లు సాధించారు. ఇక నెక్ట్స్ మరో పాన్ ఇండియా చిత్రం Hai Nannaతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కూల్ లుక్ తో, కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా కనిపించబోతున్నారు. ఈరోజు సినిమా నుంచి బిగ్ అప్డేట్ ను అందించారు. 

‘హాయ్ నాన్న’ టీజర్ ను విడుదల చేశారు. తండ్రి, కూతురి మధ్య ఎమోషన్ ను చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు నాని, మృణాల్ మధ్య  బ్యూటీఫుల్ లవ్ ను తెలియజేసేలా టీజర్ ను  వదిలారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నాని, మృణాల్, చిన్నారి సహజంగా కనిపించారు. ఈ తండ్రి కూతురు ఎమోషన్ కు మ్యాచ్ అయ్యేలా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ బీజీఎం అందించారు. ప్రస్తుతం టీజర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. 

ఇక ఈ చిత్రానికి శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా నాని కూతురిగా అలరించబోతోంది. క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  కథానాయిక. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రధానమైన ఇండియన్ రీజినల్ ల్యాంగ్వేజె స్ లో విడుదల చేయబోతున్నారు. టీజర్ ఐదు భాషల్లో విడుదలై ఆకట్టుకుంటోంది.

మరోవైపు ‘హాయ్ నాన్న’ రిలీజ్ డేట్ ను కూడా యూనిట్ ప్రకటించింది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. డిసెంబర్ 7న అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఆ తరువాత రోజునే నితిన్ ‘ఎక్ట్ర్సా ఆర్డినరి మ్యాన్’ చిత్రం రిలీజ్ కాబోతోంది. వెంటనే విశ్వక్ సేన్ ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ కూడా విడుదల కానుండటం విశేషం. నాని సినిమాతో డిసెంబర్ లో సినిమాల సందడి మొదలవ్వబోతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?