మహేష్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా నాని..?

Published : Jun 25, 2019, 03:47 PM IST
మహేష్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ గా నాని..?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. మే 9న విడుదలైన ఈ సినిమా ఈ నెల 27కి యాభై రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

దాదాపు 200 కేంద్రాల్లో ఇప్పటికీ 'మహర్షి' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు సినిమా యాభై రోజుల దిశగా  పరుగులు తీస్తుండడంతో యాభై రోజుల వేడుకను ఘనంగా  నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హీరో నాని హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. నానికి ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ ఉంది. ఈవెంట్స్ కి ఎవరు పిలిచినా.. హాజరవుతూ వాళ్లను ప్రోత్సహిస్తుంటాడు.

నిర్మాత దిల్ రాజు 'మహార్హి' సినిమా యాభై రోజుల వేడుకకు నానిని రావాలని ఆహ్వానించగా.. దానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, వెంకీ అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని వంతు వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..