దసరా సెన్సార్ కంప్లీట్... నాని సినిమాకు ఏం ఇచ్చారంటే!

Published : Mar 18, 2023, 11:53 AM IST
దసరా సెన్సార్ కంప్లీట్... నాని సినిమాకు ఏం ఇచ్చారంటే!

సారాంశం

హీరో నాని లేటెస్ట్ మూవీ దసరా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.   

నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మార్చి 30న దసరా చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దసరా ట్రైలర్ ఆకట్టుకుంది. నాని లోని సరికొత్త కోణం దసరా మూవీలో ఆవిష్కరించినట్లు అర్థం అవుతుంది. మాస్ డీగ్లామర్ పాత్రలో నాని విశ్వరూపం చూపించాడు. విడుదలకు సమయం దగ్గర పడగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. సెన్సార్ సభ్యులు దసరా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 

దసరా చిత్రంలో వైలెన్స్ ఎక్కువగానే ఉంది. అలాగే డైలాగ్స్ లో బూతు పదాలు వాడినట్లు సమాచారం. ఈ క్రమంలో దసరా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని పదాలు మ్యూట్ చేయాలని మేకర్స్ కి సెన్సార్ సభ్యులు సూచించారని వినికిడి. లేదంటే అడల్ట్ కంటెంట్ గా సర్టిఫై చేస్తామన్నారట. సెన్సార్ సభ్యుల రిపోర్ట్ ప్రకారం సినిమా బాగానే ఉందట. 

ఇక దసరా చిత్ర  విజయంపై హీరో నాని చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఆయన ట్రాక్ ఏమంత బాగోలేదు. ఈ మధ్య కాలంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మాత్రమే హిట్ స్టేటస్ అందుకుంది. గత ఏడాది విడుదలైన అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది. నాని మార్కెట్ ని బాగా దెబ్బతీసిన చిత్రం అది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. 

దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. డార్క్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. లవ్, పాలిటిక్స్, సోషల్ డిఫరెన్సెస్ వంటి విషయాలు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Rashmika Mandanna Photos leak: విజయ్‌ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్‌ శెట్టితో టూర్‌ ఫోటోలు లీక్