ప్రభాస్ డై హార్డ్‌ ఫ్యాన్‌ ఏం చేశాడో చూశారా..?

By AN TeluguFirst Published Aug 26, 2019, 12:21 PM IST
Highlights

సాహో చిత్రంలోంచి డై హార్డ్‌ఫ్యాన్స్‌ అనే డైలాగ్‌ ప్రస్తుతం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అది ప్రభాస్‌ అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా రాసిన సంగతి తెలిసిందే. డార్లింగ్‌కు బయట నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 

'సాహో' టీజర్ విడుదలైన తర్వాత 'వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే ప్రభాస్ కి  డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఒరిస్సాకు చెందిన ఓ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రం వచ్చేలా తయారు చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా డై హార్డ్ ఫ్యాన్ చేసిన పనికి అప్రిషియేట్ చేస్తున్నారు. ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్లైన్ లో టికెట్స్ పెట్టగానే నిమిషాల్లో అమ్ముడైపోతున్నాయి. దీన్ని బట్టి ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతోంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించింది. 

Prabhas' Art by by using 486 Rubik's cubes 👌👌 pic.twitter.com/23pJ0om26i

— Prabhas Fan !!! (@Rahul_Prabhas_)
click me!