#FDFS:‘ఖుషి’ఫస్ట్‌ షో టికెట్ల కోసం రచ్చ ( ట్రైలర్ )

Published : Aug 24, 2022, 06:11 PM IST
#FDFS:‘ఖుషి’ఫస్ట్‌ షో టికెట్ల కోసం రచ్చ ( ట్రైలర్ )

సారాంశం

 హీరో పేరు శ్రీను. పవన్ కళ్యాణ్‌ అభిమాని. కాలేజీలో ఒక  అమ్మాయిని ఇష్టపడతాడు. చాలా రోజులు ఆ అమ్మాయి వెంటపడితే తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని అడుగుతుంది. 

వెటరన్ నిర్మాత  ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన పూర్ణోదయ, ఇప్పుడు శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తిరిగి నిర్మాణంలోకి వచ్చింది. మిత్రవింద మూవీస్‌ తో కలిసి ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ “ఫస్ట్ డే ఫస్ట్ షో” చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆయన కుమారుడు ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. “ఫస్ట్ డే ఫస్ట్ షో” సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్.    ఈ చిత్రానికి మిత్రవింద మూవీస్ సంస్థ కో-ప్రొడ్యూసర్. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, చిత్రానువాదం, సంభాషణలు అందించిన ఈ సినిమాతో వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 

రాథన్ స్వరపరిచిన పాటల్లో రెండు ఇప్పటికే విడుదల అయ్యి చక్కని ఆదరణ పొందాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని సైతం మూవీ టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని హీరో నాని విడుదల చేసారు.

2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా రిలీజ్ టైమ్ లో జరిగిన కథగా ఈ మూవీ వుండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. 
ఇందులో  హీరో పేరు శ్రీను. పవన్ కళ్యాణ్‌ అభిమాని. కాలేజీలో ఒక  అమ్మాయిని ఇష్టపడతాడు. చాలా రోజులు ఆ అమ్మాయి వెంటపడితే తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లను సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. 

హీరో లక్ష్యం.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది.  థియేటర్ దగ్గర పవన్ అభిమానులు చేసే హంగామా, ఆ సమయంలో ఊరిలో ఉండే వాతావరణం ట్రైలర్ లో చక్కగా చూపించారు. మరి ఇంత చిన్న పాయింట్ తీసుకుని దర్శకులు ఈ కథను ఆసక్తికరంగా ఎలా మలిచారన్నది చూడాల్సిందే!

శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను దర్శక నిర్మాతలు గత కొంతకాలంగా ఆసక్తికరంగా జనం ముందుకు తీసుకొస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Psych Siddhartha Movie Review: సైక్‌ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్‌.. జెంజీ మూవీతో నందుకి హిట్‌ పడిందా?
Illu Illalu Pillalu Today Episode Jan 1: విశ్వక్‌ను ఇంట్లోంచి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చిన ప్రేమ, చంపేస్తానంటూ వార్నింగ్