జెర్సీ యూఎస్ ప్రీమియర్ షో టాక్

By Prashanth MFirst Published Apr 19, 2019, 5:46 AM IST
Highlights

గత కొంత కాలంగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్న నాని ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన జెర్సీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ ను మన యూఎస్ ప్రేక్షకులు ముందే చూసేశారు. 
 
ఇక సినిమా టాక్ విషయానికి వస్తే.. గతంలో నాని చేసిన రొటీన్ సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. ఒక ఆటలో మనిషి ఒడిపోతూనే జీవితంలో కూడా ఎదురుదెబ్బలు తినడం వంటి విషయాలను దర్శకుడు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చూపించాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ యుద్ధం సరికొత్తగా ఉంటుంది. 

ఈ కథ 1986 అలాగే 1996 లలో ఎక్కువగా సాగుతుంటుంది. ప్రేమలో పడిన క్రికెటర్ పెళ్లి తరువాత ఎదుర్కొన్న అవమానాలు ఓ కొడుకుతో ఉండే ఆప్యాయత.. ఇలా ప్రతి ఎమోషన్ సీన్స్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి. పక్కా ప్రొఫెషనల్ క్రికెటర్ గా నాని కనిపించిన విధానం అద్భుతం. కథ కన్నా నాని నటనకు వంద మార్కులు వేయాల్సిందే. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్ మళ్ళీ మంచి మూడ్ లోకి తీసుకెళుతుంది.

నాని క్రికెట్ టీమ్ లో సెలెక్టవ్వడం నుంచి గ్రౌండ్ లో గేమ్ ఆడే వరకు ప్రతి సీన్ పర్ఫెక్ట్. సీన్స్ అన్ని అర్జున్ లైఫ్ లోకి ఆడియెన్స్ ని తీసుకెళుతుంది. అనిరుధ్ ఇచ్చిన సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కెమెరా పనితనం అద్భుతం. వింటేజ్ సెట్స్ లలో దర్శకుడు లైవ్ క్రికెట్ చూపించడాని చెప్పవచ్చు. మొత్తంగా నాని నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన ఒక సూపర్ సిక్సర్ జెర్సీ.. సమ్మర్ లో ఈ బొమ్మ ఫీల్ గుడ్ మూవీ.

click me!