చిరుత చూపుల మోక్షజ్ఞ.. కొత్త లుక్ కేక!

Published : Jun 10, 2019, 06:09 PM IST
చిరుత చూపుల మోక్షజ్ఞ.. కొత్త లుక్ కేక!

సారాంశం

నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం బాలయ్య, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా సినిమాల్లో రాణిస్తున్నారు. బాలయ్య తన తండ్రి వారసత్వాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించాడు. జూ. ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం బాలయ్య, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా సినిమాల్లో రాణిస్తున్నారు. బాలయ్య తన తండ్రి వారసత్వాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించాడు. జూ. ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 

తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ బయటకు వచ్చింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ కారులో ప్రయాణిస్తూ అభిమానుల కంట పడ్డాడు. ఈ ఫొటోల్లో మోక్షజ్ఞ గతంలో కంటే కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తున్నాడు. హీరోకు కావలసిన ఆ రాజసం, ముఖంలో మెరుపు మోక్షజ్ఞలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోక్షజ్ఞ లుక్ చాలా బావుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అవసరమైన నటన, డాన్సుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ బోయపాటి దర్శకత్వంలో ఉంటుందని, క్రిష్ దర్శకత్వంలో అంటూ ఇటీవల అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య తన కొడుకు గురించి ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నాడో. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి