బాలయ్య క్లాసీ టైటిల్ తో రాబోతున్న శర్వానంద్..

Published : Mar 29, 2024, 01:28 PM IST
బాలయ్య క్లాసీ టైటిల్ తో రాబోతున్న శర్వానంద్..

సారాంశం

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల శర్వానంద్ తండ్రైన సంగతి తెలిసిందే. గత ఏడాది శర్వానంద్, రక్షిత అనే అమ్మయిని వివాహం చేసుకున్నారు. 

హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల శర్వానంద్ తండ్రైన సంగతి తెలిసిందే. గత ఏడాది శర్వానంద్, రక్షిత అనే అమ్మయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇటీవల పండంటి కూతురు జన్మించింది. 

ఈ జోష్ లో శర్వానంద్ మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. మనమే చిత్రంతో పాటు శర్వానంద్ మరో చిత్రానికి కూడా కమిటయ్యారు. సామజవరగమన లాంటి హిట్ మూవీ తెరకెక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రం చేస్తున్నాడు. 

ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో శర్వానంద్ కి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా సాక్షి వైద్యని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు రామ్ అబ్బరాజు ఆసక్తికరమైన టైటిల్ పిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం గుర్తుందిగా. 

ఇప్పుడు శర్వానంద్ చిత్రానికి కూడా అదే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారట. డైరెక్టర్ రామ్ అబ్బరాజుకి తెలుగుదనం ఉండే టైటిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే చివరగా సామజవరగమన అనే టైటిల్ పెట్టి హిట్టు కొట్టారు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి అంటున్నారు. దీనితో ఈ మూవీకి బాలయ్య క్రేజ్ కూడా కాస్త యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రావలసి ఉంది.   

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!