దిగొచ్చినా బాలయ్య.. హిందూపూర్‌ ప్రజలకు శుభవార్త

Published : Aug 23, 2020, 10:19 PM ISTUpdated : Aug 23, 2020, 10:25 PM IST
దిగొచ్చినా బాలయ్య.. హిందూపూర్‌ ప్రజలకు శుభవార్త

సారాంశం

ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు కూడా అందుబాటులో లేడనే కామెంట్స్ వినిపించాయి. సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడటం లేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇక మీడియాలోనూ ఆయనపై వార్తలు గుప్పుమన్నాయి.

టాలీవుడ్‌ టాప్‌ అండ్‌ సీనియర్‌ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ కనిపించకుండా పోయి చాలా రోజులవుతుంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా చిత్రపరిశ్రమ పెద్దలపై, సీఎంపై పలు విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కిన బాలయ్య ఆ తర్వత కనిపించడం మానేశాడు. 

ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు కూడా అందుబాటులో లేడనే కామెంట్స్ వినిపించాయి. సొంత నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడటం లేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇక మీడియాలోనూ ఆయనపై వార్తలు గుప్పుమన్నాయి. ఇన్ని రోజులు కరోనాకి బయపడి ఇంటికే పరిమితమైన బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. 

తమ నియోజకవర్గ ప్రజల కోసం 55లక్షల విలువగల మెడిసిన్‌, పీపీఈ కిట్లు, మాస్క్ లు, ఇతర ఎక్విప్‌మెంట్‌ విరాళంగా అందించారు. వైరస్‌తో ముందుండి పోరాడుతున్న హిందూపూర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వీటిని అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్‌ విరాళంగా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా అందించిన విషయం తెలిసిందే. సీసీసీకి కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా