తెలుగు సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్

Published : May 02, 2019, 08:51 PM IST
తెలుగు సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్

సారాంశం

ఇండియన్ టాప్ యాక్టర్స్ లో ఒకరైన నానా పటేకర్ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా రానా నటిస్తున్న సినిమాలో ఈ సీనియర్ నటుడు ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

ఇండియన్ టాప్ యాక్టర్స్ లో ఒకరైన నానా పటేకర్ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా రానా నటిస్తున్న సినిమాలో ఈ సీనియర్ నటుడు ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నీది నాది ఒకే కథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఉడుగుల రానాతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 

సినిమా టైటిల్ విరాటపర్వం అని ఫిక్స్ చేశారు. ఇక సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తెలంగాణ రురల్ విలీజెస్ కి సంబందించిన పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. రానా ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ నానా పటేకర్ కి కథను వినిపించి ఒప్పించినట్లు తెలుస్తోంది. 

మరాఠీ - హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించే నానా పటేకర్ సౌత్ సినిమాల్లో నటించింది చాలా తక్కువ. చివరగా కాలా సినిమాలో కనిపించిన ఈ యాక్టర్ ఇప్పుడు తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

PREV
click me!

Recommended Stories

The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే