నమ్రత ఇంట్లో ఎందరు అబ్బాయిలు ఉన్నారో తెలుసా?

Published : Nov 07, 2020, 02:47 PM IST
నమ్రత ఇంట్లో ఎందరు అబ్బాయిలు ఉన్నారో తెలుసా?

సారాంశం

తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు నమ్రత శిరోద్కర్‌. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్‌, గౌతమ్‌, సితారల ఫోటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది నమ్రత. 

మహేష్‌బాబు భార్య, మాజీ హీరోయిన్‌ నమ్రత ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్‌, గౌతమ్‌, సితారల ఫోటోలను షేర్‌ చేస్తుంది. తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది నమ్రత. అంతేకాదు తమ ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలు అంటూ ఓ ఫోటోని పంచుకున్నారు. 

ఇందులో మహేష్‌, గౌతమ్‌ని సరదాగా ఉన్న సమయంలో తీసిన ఫోటో ఇది. మహేష్‌ ఇందులో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ థ్రో బ్యాక్‌ ఫోటో ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే వీరి వద్ద పెంచుకునే డాగ్‌ కూడా ఉంది. నమ్రత లెక్క ప్రకారం అది కూడా మేల్‌ డాగ్‌ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో సందడి చేసిన మహేష్‌ ఇప్పుడు `సర్కారు వారి పాట`లో నటిస్తున్నారు. ఇది త్వరలో షూటింగ్‌ ప్రారంభించుకోబోతుంది. పరశురామ్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుండగా, ఆయన సరసన కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా