కింగ్ నాగార్జున నెక్ట్స్ సినిమా ‘నా సామిరంగ’. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఇద్దరు యంగ్ బ్యూటీలు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) ఆరుపదుల వయస్సులోనూ వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. యాక్షన్ చిత్రాలతోనూ అదరగొడుతున్నారు. గతేడాది రెండు సినిమాలతో వచ్చారు. ‘బంగర్రాజు’తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలోని యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’ సినిమాతో వచ్చారు. ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. అయితే ఇటీవల నాగార్జున నుంచి స్టైలిష్, సాఫ్ట్ చిత్రాలు మాత్రమే వస్తున్నాయి. ఎట్టకేలకు నాగార్జున తన నెక్ట్స్ మూవీతో మాస్ కోణాన్ని బయటకి తీసారు.
నాగార్జున తదుపరి చిత్రం ‘నా సామిరంగ’. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను కింగ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగార్జున యాటిట్యూడ్, గెటప్ ఊరమాస్ అనిపించేలా ఉండటంతో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ తప్పదని తెలుస్తోంది. విజయ్ బిన్నీ దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత అందిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని హీరోయిన్లు ఎవరనేది మేకర్స్ సస్పెన్స్ లో పెటారు.
undefined
తాజాగా Naa Saami Ranga చిత్రంలోని హీరోయిన్లపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. నాగార్జున సరసన ఇద్దరు యంగ్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ తో ‘అమిగోస్’ చిత్రంలో నటించిన ఆశికా రంగనాథ్ (Ashika Ranganath) నాగ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ బ్యూటీకి తమిళం, కన్నడలో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతోంది. ఇక మరో యంగ్ బ్యూటీ, ‘జైలర్’ కోడలు మిర్నా మీనన్ (Mirna Menon) కూడా ‘నా సామిరంగ’లో నటిస్తోందని సమాచారం. ఇద్దరు యంగ్ హీరోయిన్లు నాగ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అయితే, నాగ్ సరసన నటించబోతున్నారా? లేదా మరేదైనా కీలక పాత్రలు పోషించనున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై అప్డేట్ కూడా రానుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారంట మేకర్స్.. 2022లో నాగ్, చై నటించిన ‘బంగార్రాజు’ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.