స్కంద 3 డేస్ కలెక్షన్స్... రామ్ కి మరో ప్లాప్ తప్పేలా లేదు!

Published : Oct 01, 2023, 02:30 PM IST
స్కంద 3 డేస్ కలెక్షన్స్... రామ్ కి మరో ప్లాప్ తప్పేలా లేదు!

సారాంశం

స్కంద మూడో రోజు వసూళ్లు నిలకడగా ఉన్నాయి; రెండో రోజుతో పోల్చుకుంటే పెద్దగా డ్రాప్ లేదు అయితే ఈ స్థాయి వసూళ్లు సరిపోవు...   

దర్శకుడు బోయపాటి-రామ్ పోతినేనిల పాన్ ఇండియా చిత్రం స్కంద. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కింది. స్కంద చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్ డే స్కంద పర్లేదు అనిపించింది. మొదటిరోజు ఏపీ/తెలంగాణాలలో స్కంద రూ. 8.52 కోట్ల షేర్ రాబట్టింది. సెకండ్ డే స్కంద వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయాయి. స్కంద రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో  రూ. 3.50 కోట్ల షేర్ రాబట్టగలిగింది. నైజాంలో 1.52 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. ఏపీలో వసూళ్లు మరింత క్షీణించాయి. 

రెండు రోజులకు ఏపీ/తెలంగాణా కలిపి రూ. 12.12 కోట్ల షేర్, రూ. 19.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్ రూ.1.25 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ స్కంద టూ డేస్ కలెక్షన్స్ చూస్తే... రూ.14.57 కోట్ల షేర్, రూ. 24.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు స్కంద వసూళ్లు నిలకడగా ఉన్నాయి. స్వల్పంగా డ్రాప్ అయ్యాయి. 

స్కంద థర్డ్ డే రూ. ఏపీ/తెలంగాణాలలో రూ.3.27 కోట్ల షేర్ రూ. 5.55 కోట్ల గ్రాస్ రాబట్టింది. నైజాంలో స్కంద రూ. 1.57 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 37 లక్షల వసూళ్లు దక్కాయి. వరల్డ్ వైడ్ స్కంద మూడు రోజులకు స్కంద రూ. 18.38 కోట్ల షేర్, 31.05 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి.   స్కంద చిత్రం దాదాపు రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రామ్ హిట్టు కొట్టి చానళ్ళు అవుతున్నా బోయపాటి శ్రీనుపై నమ్మకంతో బిజినెస్ జరిగింది. 

రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన స్కంద రాబట్టాల్సిన వసూళ్లు చాలా ఉన్నాయి. ఆదివారం బుకింగ్స్ తగ్గిన నేపథ్యంలో స్కంద మరో రూ. 28 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ తెచ్చుకోవడం కష్టమే అనిపిస్తుంది. స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. సాంగ్స్, బీజీఎం విషయంలో థమన్ ఫెయిల్ అయ్యాడన్న మాట వినిపిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.   
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?