మహేష్‌బాబు-రాజమౌళి సినిమాలో నాగార్జున.. ఏం చేయబోతున్నారంటే?

Published : Jan 30, 2024, 06:54 PM IST
మహేష్‌బాబు-రాజమౌళి సినిమాలో నాగార్జున.. ఏం చేయబోతున్నారంటే?

సారాంశం

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ మూవీ రూపొందబోతుంది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. అయితే ఇందులో నాగార్జున భాగం కాబోతున్నారట. మరి ఏం చేయబోతున్నారు..

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. భారీ పాన్‌ ఇండియా సినిమాగా కాదు, ఇంటర్నేషనల్‌ మూవీ రేంజ్‌లో దీన్ని తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారట. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ ఇది. ఇందులో మహేష్‌ బాబు సాహసికుడి పాత్రలో కనిపించబోతున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. వీలైతే మరో రెండు మూడు నెలల్లో, మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి ఈ మూవీని చాలా పెద్ద స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌ అంటున్నారు. కానీ ఐదు వందల కోట్లకుపైగానే ఉంటుందని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఈ మూవీని రిలీజ్‌ చేసే ప్లాన్లో ఉన్నారు రాజమౌళి. అంతేకాదు దీన్ని రెండు మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్‌ బాబు పారితోషికం తీసుకోవడం లేదట. ఆయన రెమ్యూనరేషన్‌ తీసుకోకుండానే నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిర్మాణంలో ఆయన భాగమవుతున్నట్టు సమాచారం. తన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ భాగస్వామిగా మారుతుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో కింగ్‌ నాగార్జున కూడా భాగం కాబోతున్నారట. అంతే ఆయన నటించడం లేదు. కానీ నిర్మాణంలో భాగమవుతున్నారట. తన అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్షన్‌లో బ్యాక్‌ సపోర్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, వీఎఫ్‌ఎక్స్ ఇలా పలు విభాగాల్లో ఈ మూవీ భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో