శిల్పా రెడ్డికి కరోనా.. హీరో నాగర్జున‌ ఏమన్నాడంటే..?

Published : Jun 25, 2020, 05:37 PM IST
శిల్పా రెడ్డికి కరోనా.. హీరో నాగర్జున‌ ఏమన్నాడంటే..?

సారాంశం

శిల్పారెడ్డి అక్కినేని కుటుంబానికి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. శిల్పాకు కరోనా పాజిటివ్‌ అన్ని నిర్ధారణ అవ్వడానికి రెండు రోజులు ముందు సమంత శిల్పను కలిసింది. దీంతో అక్కినేని అభిమానుల్లోనూ కలవరం మొదలైంది.  ఈ సందర్భంగా నాగ్‌ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల సెలబ్రిటీలు కూడా కరోనా పాజిటివ్‌గా తేలుతుండటంతో అన్ని వర్గాల్లోనూ కలవరం మొదలైంది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉండే శిల్పా రెడ్డి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ తరుణంలో కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కింగ్ నాగార్జున ట్వీట్ చేశాడు.

శిల్పారెడ్డి అక్కినేని కుటుంబానికి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. శిల్పాకు కరోనా పాజిటివ్‌ అన్ని నిర్ధారణ అవ్వడానికి రెండు రోజులు ముందు సమంత శిల్పను కలిసింది. దీంతో అక్కినేని అభిమానుల్లోనూ కలవరం మొదలైంది.  ఈ సందర్భంగా నాగ్‌ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కరోనాను ఎదుర్కొనటానికి మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండటం ఒక్కటే ప్రజలు ప్రధాన ఆయుధం అన్నాడు నాగ్‌.

నాగ్‌ తన మెసేజ్‌తో పాటు కరోనా నుంచి కోలుకున్న శిల్పా రెడ్డి వీడియోను కూడా షేర్ చేశాడు నాగ్‌. ఆ వీడియోలో శిల్పా తనకు కరోనా ఎలా సోకింది వివరించింది. కరోనా అంతా ప్రమాదకరం ఏమీ కాదన్న శిల్పా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ మహమ్మారిని ఈజీగా జయించవచ్చని చెప్పింది. అయితే ఈ సమయంలో రోగ నిరోదక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని, ప్రతీ రోజు తప్పకుండా వ్యాయామం చేయాలని, ప్రాణాయామం కూడా చేయటం తప్పని సరి అని ఆమె తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా