
అక్కినేనివారింట పెళ్లి సందడి మొదలయ్యింది. నాగార్జున చిన్న కొడుకు యంగ్ హీరో అఖిల్ పెళ్లి జైనాబ్ తో జరగబోతోంది. అక్టోబర్ 6న జరగబోతున్న ఈ వివాహానికి సినీరాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు నాగ్. ఈక్రమంలోనే వరుసగా పెద్దవారిని నాగార్జున స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈక్రమంలోనే నాగార్జున ఏపీ సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా నాగార్జున తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను ఆయన స్వయంగా సీఎంకు అందజేశారు. అక్టోబర్ 6వ తేదీన జరగనున్న అఖిల్ వివాహానికి కుటుంబ సమేతంగా హాజరవ్వాలని ఆయన కోరారు. అంతే కాదు కొద్దిసేపు వారు రాజకీయ సినిమా అంశాలకు సబంధించిన విషయాలు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
అఖిల్ పెళ్లికి చంద్రబాబు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా, సీఎం షెడ్యూల్ లో ఈ విషయాన్ని చేర్చినట్టు సమాచారం.
ఇక అఖిల్ పెళ్లి జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో సంబరాలు అబ్బరాన్ని అంటుతున్నాయి. అఖిల్ వివాహానికి ప్రభుత్వ, రాజకీయ, సినీ రంగ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు నాగార్జున. ఈక్రమంలో నాగార్జున రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. భార్య అమల, వియ్యంకులతో కలిసి రేవంత్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్ ను అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నిశ్చితార్థం గత సంవత్సరం నవంబర్ 26న ఘనంగా జరిగింది. అఖిల్, జైనబ్ ఇద్దరికీ మునుపటి నుంచే పరిచయం ఉందని, ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఇక ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగింది. అప్పుడు కూడా వీరిద్దరు ప్రేమించుకునే పెళ్లికి రెడీ అయ్యారు. నాగ చైతన్య వివాహ సమయంలోనే అఖిల్ వివాహం కూడా జరిపించాలని నాగార్జున అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ నిశ్చితార్థం రద్దయింది.