నా స్నేహితుడ్ని కోల్పోయాను.. నాగార్జున ఆవేదన!

Published : Oct 27, 2018, 01:49 PM IST
నా స్నేహితుడ్ని కోల్పోయాను.. నాగార్జున ఆవేదన!

సారాంశం

కామాక్షి మూవీస్ అధినేత, టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి(62)ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు

కామాక్షి మూవీస్ అధినేత, టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి(62)ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. హీరో నాగార్జునతో శివప్రసాద్ కి ప్రత్యేకమైన బంధం ఉంది. నాగార్జున నటించిన ఎన్నో చిత్రాలకి శివప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

శివప్రసాద్ సినీ ప్రస్థానం దాదాపు నాగార్జునతోనే కొనసాగింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. శివప్రసాద్ మరణంతో ఎమోషనల్ అయిన నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

''నేను నా స్నేహితుడు, నిర్మాత అయిన శివప్రసాద్ రెడ్డిని కోల్పోయాను. 33 సంవత్సరాలుగా నా సినీ కెరీర్, జీవితంలో ఆయన భాగమైపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని వెల్లడించారు. 

సంబంధిత వార్త.. 

ప్రముఖ నిర్మాత క‌న్నుమూత‌!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు