కత్రినాను అలా రిసీవ్ చేసుకున్న నాగ్.. ఆ మాత్రం దానికే గోల చేస్తున్నారే?

By Asianet News  |  First Published Oct 28, 2023, 1:45 PM IST

అక్కినేని నాగార్జున - బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రీసెంట్ గా ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా నాగ్ కత్రినాను పలకరించారు. నాగార్జున కత్రినాను రిసీవ్ చేసుకున్న తీరుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 
 


అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఆరుపదుల వయస్సులోనూ ఫిట్ గా, అట్రాక్టివ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ డ్రెసింగ్, హెయిర్ స్టైల్ ను మెయింటేయిన్ చేస్తూ అదరగొడుతోంది. కనిపించిన ప్రతిసారి నయా లుక్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే, తాజాగా నాగార్జున కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కింగ్ హాజరయ్యారు. 

ఈ వేడుకకు బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) కూడా వచ్చింది. ఈ సందర్భంగా నాగ్ - కత్రినా ఎదురుపడ్డారు. దీంతో నాగార్జున యంగ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను పలకరించారు. చేతిలో చేయి వేసి మాట్లాడారు. ఓ హగ్, ముద్దు కూడా పెట్టారు. సెలబ్స్ సాధారణంగా ఇలాగే పలకరించుకోవడం చూస్తుంటాం. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నాగ్ ను ఏకిపారేస్తున్నారు. 

Latest Videos

undefined

యంగ్ హీరోయిన్  కత్రినా కైఫ్ ను రిసీవ్ చేసుకునే తీరును తప్పుబడుతున్నారు. ఈ వయస్సులో ఇవేం పనులంటూ.. కాస్తా పద్ధతిగా ఉంటే బాగుంటుందేమోనంటూ కామెంట్లు పెడుతున్నారు. హుందాగా ఉండొచ్చు కదా అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినీ కల్చర్ లో ఇలా రిసీవ్ చేసుకోవడం కామనేగా.. తప్పేముందంటున్నారు. ఈ మాత్రందానికే గోల చేస్తున్నారా అనే వారు లేకపోలేరు. ఏదేమైనా నాగ్ - కత్రినా పలకరింపుల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక నాగార్జున అటు హీరోగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం ‘నా సామిరంగ’లో నటిస్తున్నారు. అలాగే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు హోస్ట్ గానూ వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. మరోవైపు కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత సినిమాల జోరు తగ్గించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు జోడీగా భారీ యాక్షన్ ఫిల్మ్ ‘టైగర్3’లో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

click me!