నాగ్‌-అఖిల్‌ మల్టీస్టారర్‌.. దర్శకుడు ఎవరో తెలుసా?

By Aithagoni Raju  |  First Published Nov 15, 2020, 2:20 PM IST

నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట. 


నాగార్జున సక్సెస్‌ కోసం తపిస్తున్నారు. ఆయనకు ఇటీవల కాలంలో విజయాలు లేవు. `దేవదాస్‌` ఫర్వాలేదనిపించినా, అది హిట్‌ ఖాతాలో పడలేదు. ఇక సరికొత్తగా రాబోతున్నారు. ఎన్‌ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట. 

 పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుందనేది ఓ ఎత్తైతే.. దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల అనిల్‌ రావిపూడి సినిమాలు చూసి ఇంప్రెస్‌ అయిన నాగ్‌.. ఆయనతో పనిచేయాలని  భావించగా, అందుకోసం అనిల్‌ ఓ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇదిలా మరో సర్‌ప్రైజింగ్‌ విషయం ఏంటంటే అఖిల్‌ ఇందులో నటించబోతుండటం. నాగ్‌, అఖిల్‌ కలిసి మల్టీస్టారర్‌గా దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందట. ప్రస్తుతం అఖిల్‌.. భాస్కర్‌ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నారు.

Latest Videos

click me!