
రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజమే. కొత్తవారికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా రాజకీయాల్లో మునిగితేలి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వారికి చాలా తేలిక. అయితే పవన్ విషయంలో ఇది డిఫరెంట్ అంశం. ఆయనపై ఆరోపణలు చేస్తున్న వారు పర్సనల్ గా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారన్నది తెలిసిందే.
అయితే తన పాలిటిక్స్ లో ఎన్ని ఓడు దుడుకులు ఎదురైనా ఒంటరిగానే పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కు ఇప్పుడు ఇతర వర్గాల నుంచి ఎక్కువగా మద్దతు అందుతోంది. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగబాబు విమర్శల డోస్ గట్టిగా పెంచుతూ పవన్ కు సపోర్ట్ గా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ కాంట్రవర్సీ జరిగినా అందులో నాగబాబు కామెంట్స్ కూడా ఉంటున్నాయి.
శ్రీ రెడ్డి కామెంట్స్ తరువాతే నాగబాబు తన మాటలకు పదును ఎక్కువగా పెంచారని చెప్పాలి. బాలకృష్ణ నుంచి చంద్రబాబు, జగన్ ల వరకు ఎవ్వరిని వదిలిపెట్టకుండా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఓ వార్నింగ్ లు కూడా యాడ్ చేస్తున్నారు.
తనకు ఎన్నో సార్లును సాయం చేసిన తమ్ముడికి నేను ఇంతవరకు ఏమి చేయలేదని గతంలో చెప్పిన నాగబాబు ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఎవరుపడితే వాడు విమర్శలతో విర్రవీగుతున్నాడని పవర్ స్టార్ కు తన సరికొత్త ఆలోచనతో కౌంటర్ ఇస్తూ తనవంతు సాయిం చేస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఈ సపోర్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..