భర్త జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన నిహారిక... ఆ రెండు ఫోటోలు మాత్రం!

Published : Apr 10, 2023, 06:26 PM ISTUpdated : Apr 10, 2023, 06:32 PM IST
భర్త జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన నిహారిక... ఆ రెండు ఫోటోలు మాత్రం!

సారాంశం

నిహారిక-వెంకట చైతన్య విడాకుల వైపు అడుగులేశారనే మరో హింట్ లభించింది. ఈ విషయాన్ని నాగబాబు డాటర్ నిహారిక పరోక్షంగా తెలియజేశారు.   

కొద్ది రోజులుగా నటి నిహారిక కొణిదెల భర్త వెంకట చైతన్యతో విడిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. వెంకట చైతన్య తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. విందులు, విహారాలతో పాటు ఆమె జ్ఞాపకాలకు సంబంధించిన ఆనవాళ్లు తుడిచేసాడు. నిహారికను అన్ ఫాలో చేశాడు. నిహారిక కూడా వెంకట చైతన్యను అన్ ఫాలో చేశారు. అయితే ఆమె ఫోటోలు డిలీట్ చేయలేదు. దీంతో వెంకట చైతన్య మాత్రమే కోపంగా ఉన్నాడని, మనస్పర్థలు తొలిగి కలిసిపోతారనే వాదన వినిపించింది. 

అనూహ్యంగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి డిలీట్ చేశారు. తాజాగా ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. విడాకుల ఊహాగానాలు మొదలైన ఇరవై రోజుల తర్వాత నిహారిక పెళ్లి ఫోటోలు అకౌంట్ నుండి డిలీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సఖ్యత కుదర్లేదు. నిహారిక-వెంకట చైతన్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. 

వెంకట చైతన్య జ్ఞాపకాలు నిహారిక కూడా పూర్తిగా చెరిపేశారు. అయితే ఆయనతో పెళ్లికి సంబంధించిన రెండు పోస్ట్స్ ఆమె తొలగించలేదు. ఒకటి నిశ్చితార్థం రోజు దిగిన ఫోటో. ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళ అమ్మ నిశ్చితార్థం చీర నిహారిక కట్టుకున్నారు. ఆ చీరలో నిహారిక అమ్మ ఉన్న ఫోటోను తన ఫోటోను పక్కపక్కనే పెట్టి పోస్ట్ చేశారు. ఈ ఫోటో నిహారిక డిలీట్ చేయలేదు. అలాగే పెళ్లి పందిరిలో వెంకట చైతన్య పక్కన కూర్చుని ఉన్న ఫోటో సైతం ఆమె డిలీట్ చేయలేదు. 

మరి ఈ రెండు ఫోటోలు ఎందుకు తొలగించలేదనేది సస్పెన్సు.  2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. నిహారిక-వెంకట చైతన్యల వివాహానికి మెగా హీరోలందరూ హాజరు కాగా నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు.    
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?