
రీసెంట్ గా వరుడు కావెలెను చిత్రంతో పలకరించిన యంగ్ హీరో నాగశౌర్య . ఈ హీరో ఇప్పుడు ఆర్చరీ నేపథ్యంలో ‘లక్ష్య’చిత్రం రూపొందిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం వీలు విద్యలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోగా.. ఎయిట్ ప్యాక్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ లుక్ నుండే ఎక్సపెక్టేషన్స్ మొదలయ్యాయి. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
ఆర్చరీకి సంబంధించిన సన్నివేశాలు, హీరో,హీరోయిన్స్ లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నాగశౌర్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించారు. ‘నేను వంద మందికి నచ్చక్కర్లేదు సార్. కానీ, నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దని అనుకుంటే.. ఇక నేను గెలిచేది దేనికి సార్?’ ‘పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్‌లో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ యంగ్ హీరోలను ఇన్స్పిరేషన్ గా కనిపించింది.‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అని హీరో పాత్రను తెలియజేసేలా జగపతిబాబు చెప్పిన డైలాగ్ మెప్పిస్తోంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారి ప్రొడక్షన్ వాల్యూస్.. అన్నీ ట్రైలర్ ని పవర్ ప్యాక్ కమర్షియల్ సినిమాగా కనిపించేలా చేశాయి. నాగ శౌర్య రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తుండగా.. హీరో క్రీడా జీవితంలో ఈ రెండు దశలు ఎలా ఉండనున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి గతంలో `సుబ్రహ్మణ్యపురం` చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన ఆ చిత్రం మంచి ప్రశంసలందుకుంది. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా క్రిటికల్ మంచి ప్రశంసలందుకుంది. కమర్షియల్‌గా ఆశించిన రిజల్ట్ ని రాబట్టలేకపోయినా దర్శకుడిగా సంతోష్‌కి మంచి పేరుని తీసుకొచ్చింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు స్పోర్ట్స్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో `లక్ష్య` చిత్రాన్ని రూపొందించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.