పవన్ నిర్మాతతో ...ఓటిటి లోకి నాగ చైతన్య ఎంట్రీ! డిటేల్స్

Surya Prakash   | Asianet News
Published : Jul 23, 2021, 01:34 PM IST
పవన్ నిర్మాతతో ...ఓటిటి లోకి నాగ చైతన్య ఎంట్రీ! డిటేల్స్

సారాంశం

వరస సినిమాలతో బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య త్వరలో ఓటీటి మార్కెట్ లోకి ప్రవేశించనున్నారు.  ప్రస్తుతం థియేటర్ల కి ప్రత్యామ్నయంగా ఓటిటి ని ఆయన ప్రక్కన పెట్టదలుచుకోలేదు. 

వరస సినిమాలతో బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య త్వరలో ఓటీటి మార్కెట్ లోకి ప్రవేశించనున్నారు.  ప్రస్తుతం థియేటర్ల కి ప్రత్యామ్నయంగా ఓటిటి ని ఆయన ప్రక్కన పెట్టదలుచుకోలేదు. అందుకే ఓ పెద్ద నిర్మాతతో ముందుకు వెళ్లబోతున్నట్లు సమాచాచరం.మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒరిజినల్ ఓటిటి చిత్రం కావచ్చు అంటున్నారు. అయితే ఏ ఓటీటికు సినిమా చేస్తున్నారనేది తెలియరాలేదు.  ఈ మేరకు ఇప్పటికే శరత్ మరార్ మరియు నాగ చైతన్య అనేక  స్ర్కిప్ట్స్ పరిశీలించి ఫైనలైజ్ చేసారని వినికిడి. అయితే డైరక్టర్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. 

 నాగ చైతన్య తాజా చిత్రం లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే  ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటుగా థాంక్ యూ చిత్రం కి సంబంధించిన షూటింగ్ ను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం బంగార్రాజు షూటింగ్ తో పాటుగా ఈ ఓటిటి చిత్రం కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  దీని పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శరత్ మరార్ గతంలో మాటీవీ సీఈవోగా పని చేసారు. చిరంజీవికి సన్నిహితుడు కావడం, అతను సమర్థుడు కావడంతో చిరంజీవే ఆయన్ను మాటీవీ సీఈవోగా నియమించారట. ఈ క్రమంలోనే శరత్ మరార్‌కు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా పవన్ కళ్యాన్‌తో మంచి స్నేహం ఏర్పడింది. గతంలో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి కూడా శరత్ మరార్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాట. తర్వాత పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మరారు. ఇప్పుడు ఓటీటీలపై పూర్తి దృష్టి పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?