నాగచైతన్య ‘థ్యాంక్ యు’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Published : May 14, 2022, 11:39 AM IST
 నాగచైతన్య ‘థ్యాంక్ యు’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

సారాంశం

అక్కినేని నటవారసుడు నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు’. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.     

అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గతంతో పోల్చుకుంటే విభిన్న కథలను ఎంచుకుంటూ, ఢిఫరెంట్ రోల్స్ ప్లేచేస్తూ తన మార్క్ చూపెడుతున్నారు.  వరుస సినిమాలతో దూసుకుపోతున్న చైతూ ఇటీవల ల‌వ్‌స్టోరి, బంగార్రాజు లాంటి రెండు వ‌రుస హిట్ లను సొంతం చేసుకున్నాు. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తున్నారు. 

నాగచైతన్య, రాశీ ఖన్నా (Raashi Khanna) జంటగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు’.  రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కు బీవీఎస్ రవి అద్భుతమైన కథ అందించగా.. విక్రమ్్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండేండ్ల కిందనే సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చిన  మేకర్స్ ఇటీవల చిత్ర షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు... రిలీజ్ కు డేట్ సెట్ చేశాం. నాగచైతన్య నటించిన థ్యాంక్ యు మూవీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం సిద్ధం ఉండండి. జూలై 8న థియేటర్లలో రిలీజ్ చేబోతున్నాం.. అంటూ అధికారికంగా ప్రకటించారు.  

దీంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు  సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అవికా గోర్, మాలవికా నేర్, సాయి సుశాంత్ రెడ్డి పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా