Kamal Hassan:మళ్ళీ హాస్పటిల్ లో కమల్ హాసన్

Surya Prakash   | Asianet News
Published : Jan 17, 2022, 02:50 PM IST
Kamal Hassan:మళ్ళీ హాస్పటిల్ లో కమల్ హాసన్

సారాంశం

మహమ్మారి నుంచి కోలుకున్న వెంటనే కమల్ తమిళ ‘బిగ్ బాస్’ తాజా సీజన్ ను హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మరోసారి కమల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే విషయం ఆయన అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది.

విలక్షణ నటుడు కమల్ హాసన్ నెల క్రితం  కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.  యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది.ఈ మేరకు ఆయన   చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పటల్ లో పది రోజులు పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కోవిడ్ తగ్గాక తిరిగి రెగ్యులర్ పనుల్లో పడ్డారు.  అయితే తాజాగా  కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 ఇక ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వెంటనే కమల్ తమిళ ‘బిగ్ బాస్’ తాజా సీజన్ ను హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మరోసారి కమల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే విషయం ఆయన అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది.

 కానీ ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు చెప్తున్నారు. జనరల్ చెకప్ అయితే వెంటనే  కమల్ ఇంటికి వెళ్లనున్నారు. కాబట్టి ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే  కమల్ ఆసుపత్రిలో చేరారన్న విషయంపై ఇంకా అఫీషియల్  ప్రకటన కూడా  ఏమీ రాలేదు.
 
ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే… ఆయన ఇప్పుడు “విక్రమ్”, “ఇండియన్-2” సినిమాలు చేస్తున్నారు. “విక్రమ్” సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి కనిపించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 31న విడుదలకు సిద్ధమవుతోంది.

 మరో ప్రక్క `రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివకార్తికేయన్. తాజాగా ఆయన హీరోగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని తెలుగువారి పండుగైన క‌నుమ రోజు (ఆదివారం) అనౌన్స్ చేశారు. ప్ర‌ముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

 ఈ ఎస్‌పిఎఫ్‌ఐ సంస్థ 2019లో మలయాళంలో  పృథ్వీరాజ్ సుకుమారన్‌తో  ‘నైన్’ చిత్రం నిర్మించింది. తెలుగులో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో క‌లిసి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.  ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌.కె.ఎఫ్‌.ఐ.)తో నిర్మాణంలో పాలుపంచుకుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో