సర్దార్ డైరెక్టర్ తో నాగ చైతన్య ?.. క్రేజీ కాంబినేషన్ కుదిరినట్లేనా ? అసలు నిజం ఏంటంటే?

Published : Jul 11, 2025, 12:10 AM IST
Naga Chaitanya

సారాంశం

అక్కినేని నాగచైతన్య చివరగా తండేల్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం చైతు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మైథాలజీ, మిస్టరీ అంశాలు కలిగిన థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.

అక్కినేని నాగచైతన్య చివరగా తండేల్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం చైతు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మైథాలజీ, మిస్టరీ అంశాలు కలిగిన థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉండగా తన తదుపరి చిత్రం కోసం నాగచైతన్య ఒక క్రేజీ తమిళ దర్శకుడుతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తమిళ దర్శకుడు ఎవరో కాదు సర్దార్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన పిఎస్ మిత్రన్.

పిఎస్ మిత్రన్ ఒక స్టోరీ ఐడియాతో నాగచైతన్యని కలిసినట్లు తెలుస్తోంది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు కానీ చైతు కూడా మిత్రన్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కి సంబంధించి క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే తాజాగా చైతూ టీమ్‌ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇందులో వాస్తవం లేదని, చైతూని మిత్రన్‌ కలవలేదని సమాచారం. 

అయితే ఇటీవల కాలంలో తమిళ దర్శకులు నుంచి తెలుగు హీరోలకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నాగచైతన్య కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ చిత్రంలో నటించి ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. గేమ్ ఛేంజర్, స్పైడర్, ది వారియర్ లాంటి ఫ్లాప్ చిత్రాలు తమిళ దర్శకుల నుంచి వచ్చినవే. మరి నాగచైతన్య ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. నాగ చైతన్య ఇటీవల వైవిధ్యమైన కథల పట్ల ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు పిఎస్ మిత్రన్ కార్తీతో సర్దార్ 2 తెరకెక్కిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

టాంజానియా బయలుదేరిన మహేష్ బాబు, కిరాక్ లుక్ వైరల్.. ఈస్ట్ ఆఫ్రికా అడవుల్లో ఇక విధ్వంసమే
కోట శ్రీనివాసరావు ఫ్యామిలీలో మరో విషాదం.. ఆయన భార్య కన్నుమూత