సాయిధరమ్ తేజ్ ట్వీట్ కు నాగ చైతన్య రిప్లై.. క్రేజీగా ఫ్యాన్స్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 4, 2021, 11:41 AM IST
Highlights

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నాడు. దీనితో మెగా అభిమానులు తేజు రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నాడు. దీనితో మెగా అభిమానులు తేజు రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బైక్ ప్రమాదానికి గురైన తేజు కొన్ని వారాలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 

ఆదివారం రోజు తేజు ప్రమాదానికి గురైన తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. ఆసుపత్రి బెడ్ పై నుంచే తేజు ఈ ట్వీట్ చేయడం విశేషం. తనపై తాను నటించిన రిపబ్లిక్ చిత్రంపై మీరుచూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. త్వరలోనే కలుద్దాం అంటూ తేజు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. 

సెలెబ్రిటీలు సైతం తేజకు వెల్ కమ్ చెబుతూ రిప్లై ఇస్తున్నారు. వరుణ్ తేజ్, రాహుల్ రవీంద్రన్ లాంటి వారంతా తేజు ట్వీట్ కు రిప్లయ్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా నాగ చైతన్య కూడా తేజు ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. దీనితో అభిమానులు ఇద్దరు హీరోలపై కామెంట్స్ వర్షం కురిపిస్తూ తమ ప్రేమని తెలియజేస్తున్నారు. 'నిన్నిలా చూడడం సంతోషంగా ఉంది తేజ్ అని నాగ చైతన్య రిప్లై ఇచ్చాడు. 

సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి బెడ్ పై థమ్స్ అప్ చూపిస్తూ ట్వీట్ చేశాడు. తేజు నటించిన రిపబ్లిక్ మూవీ ఇటీవల విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. అంతకు ముందే విడుదలైన నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

So happy to see this tej !! Lots of love

— chaitanya akkineni (@chay_akkineni)
click me!