2023లో నాగ చైతన్య యాక్షన్ అవతారం.. న్యూ ఇయర్ కానుకగా కస్టడీ గ్లింప్స్ ఇదిగో..

Published : Jan 01, 2023, 11:34 AM IST
2023లో నాగ చైతన్య యాక్షన్ అవతారం.. న్యూ ఇయర్ కానుకగా కస్టడీ గ్లింప్స్ ఇదిగో..

సారాంశం

న్యూ ఇయర్ కానుకగా కస్టడీ నుంచి చిత్ర యూనిట్ చిన్న గ్లింప్స్ విడుదల చేసింది. వెంకట్ ప్రభు గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా డార్క్ థీమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

2022లో నాగ చైతన్యకి మిక్స్డ్ రిజల్ట్స్ లభించాయి. బంగార్రాజు విజయం సాధించగా.. లాల్ సింగ్ చద్దా, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక 2023లో నాగ చైతన్య ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ జోనర్ నాగ చైతన్యకి అంతగా కలసి రాలేదు. 

కానీ ఎలాగైనా హిట్ కొట్టాలని చైతు యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు. ఈ చిత్రానికి కస్టడీ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ కానుకగా కస్టడీ నుంచి చిత్ర యూనిట్ చిన్న గ్లింప్స్ విడుదల చేసింది. వెంకట్ ప్రభు గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా డార్క్ థీమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య లుక్ డిఫెరెంట్ గా ఉంది. చిన్న గ్లింప్స్ అయినప్పటికీ ఇందులో చూపిన యాక్షన్ సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. చైతు ఇంటెన్స్ లుక్ లో అదరగొడుతున్నాడు. గ్లింప్స్ లో కథకి సంబంధించిన ఎలాంటి క్లూ వదల్లేదు. 

ట్రైన్ వేగంగా వెళ్లడం.. కారు ఛేజింగ్ లు ఉన్నాయి. ఓవరాల్ గా కస్టడీ చిత్రం నాగ చైతన్య చేస్తున్న మరో ప్రయోగం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో చైతూకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vishal : సైకిల్‌పై వచ్చి ఓటేసిన విశాల్.. రాజకీయం , ప్రజాసేవ పై హాట్ కామెంట్స్
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?