#NC22 : నాగ చైతన్య - కృతి శెట్టి సినిమా షురూ.. ఆసీన్స్ తోనే మొదటి షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన చైతూ.!

By team teluguFirst Published Nov 11, 2022, 6:58 PM IST
Highlights

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య - టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న చిత్ర షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ కు సంబంధించిన డిటేయిల్స్  చాాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 

సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. చివరిగా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’తో మంచి సక్సెస్ ను అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘థ్యాంక్యూ’,‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రాలు మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. దీంతో చైతూ కేరీర్ మళ్లీ మొదటికే వచ్చినట్టైంది. దీంతో తదుపరి చిత్రాలతో ఎలాగైనా మాస్ హిట్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెక్ట్స్ సినిమాను యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించబోతున్నారు. 

తమిళ దర్శకుడు, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య తన 22వ చిత్రంలో నటిస్తున్నారు. మూవీలో యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే  పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా షూటింగ్ ను కూడా ప్రారంభించుకున్నట్టు అప్డేట్ అందింది. ఈరోజే హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టారని చిత్ర యూనిట్ తెలిపింది. 

చిత్రం మొదటిషెడ్యూల్ లొనే దర్శకుడు వెంకట్ ప్రభు భారీ యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ లోనే భారీ సెట్ కూడా వేయించారంట. అరవింద్ స్వామి విలన్‌గా.. నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటించడం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అంటున్నారు. అరవింద్ స్వామి, నాగచైతన్య మధ్య యాక్షన్ సీక్వెన్స్ కొనసాగుతోంది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. తెలుగు-తమిళం బైలింగ్వుల్ లో NC22 చిత్రాన్ని రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ లో తెరకెక్కుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ అమరేన్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్ తదితర పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!