మిత్రుడి మరణం.. కేటీఆర్ ను ప్రశ్నించిన మహానటి డైరెక్టర్!

By Prashanth MFirst Published Nov 27, 2018, 5:31 PM IST
Highlights

ట్విట్టర్ లో చురుగ్గా కనిపించే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తన బాధను వ్యక్తం చేశాడు. తన స్నేహితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చిక్కిత్స అంధక మరణించడం ఎంతో ఆవేదనను కలిగించింది అంటూ దీనికి సమాధానం ఏమిటని నాగ్ అశ్విన్ ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కెమెరామెన్ గా వర్క్ చేస్తోన్న తన స్నేహితుడు ఆదివారం యాక్సిడెంట్ కి గురవ్వడంతో వారి తల్లిదండ్రులు సమీపాన ఉన్న గాంధీ ఆసుపత్రికి తరలించారని అయితే మూడు గంటల వరకు అతను చావు బ్రతుకుల మధ్య పోరాడి వైద్యం అంధక మృతి చెందాడు. అతని తల్లి దండ్రులు స్ట్రెచర్‌ పై పడుకోబెట్టుకొని హాస్పిటల్ లో గంటల కొద్దీ మోసుకుంటూ తిరిగారని వేరే హాస్పిటల్ కి వెళ్లినా తన స్నేహితుడు బ్రతికేవాడని నాగ్ అశ్విన్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ వివరణ ఇచ్చారు. 

ఒక మనిషి ప్రాణాలు హైదరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్రతికించుకోలేమా అంటూ నాగ్ అశ్విన్ ఆవేదనతో తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రి అంటే చావుకు నిర్లక్ష్యానికి మారుపేరు అనే అర్ధాన్ని మార్చడానికి ఏం చేస్తే బావుంటుందో చెప్పండి కేటీఆర్ సర్ అంటూ ట్వీట్ చేశారు. ఫైనల్ గా తన స్నేహితుడు రాష్ట్రంలోనే బెస్ట్ కెమెరామన్ అని వివరణ ఇస్తూ ఈ మరణంపై ఎవరిని ప్రశ్నించాలో అర్ధం కావడం లేదని ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చారు.  

click me!