ఊగీసలాట మధ్య రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన నాగార్జున.. పండక్కే `నా సామి రంగ`..

By Aithagoni RajuFirst Published Dec 31, 2023, 12:21 PM IST
Highlights

సంక్రాంతి పండక్కి రావాలా ? వద్దా అనే డైలామాలో పడ్డారు నాగార్జున. కానీ ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఇక గుంపులో గోవిందం అనేలా సంక్రాంతికే రాబోతున్నారు. 

ఈ సంక్రాంతి చాలా రంజుగా ఉండబోతుంది. ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన పోటీ నెలకొనబోతుంది. ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. దీనితోడు రెండు మూడు డబ్బింగ్‌ చిత్రాలు కూడా రానున్నాయి. డబ్బింగ్‌ చిత్రాలు పక్కన పెడితే తెలుగులో `గుంటూరు కారం`, `హనుమాన్‌`, `ఈగల్‌`, `సైంధవ్‌` చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటిలో ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా కూడా పొంగల్‌నే టార్గెట్‌ చేసింది. 

నాగార్జున నటించిన `నా సామి రంగ` మూవీని సంక్రాంతికి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అయితే రిలీజ్‌ డేట్‌ ప్రకటించలేదు. సంక్రాంతికి అంటూ నాగ్‌ పదే పదే చెబుతూ వచ్చారు. ప్రమోషన్స్ కంటెంట్‌లోనూ అదే చేశారు. అయితే రిలీజ్‌ డేట్‌ ప్రకటించకపోవడంతో ఈ మూవీ వస్తుందా రాదా అనే డౌట్‌ నెలకొంది. నిర్మాతల మధ్య జరిగిన చర్చల్లో ఈ మూవీ తప్పుకుంటుందా అన్నారు. కానీ తగ్గేదెలే అంటున్నాడు నాగ్‌. తన `నా సామి రంగ` మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా రిలీజ్‌ డేట్‌ని కూడా ఇచ్చాడు. 

Latest Videos

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు సంక్రాంతి కానుకగా జనవరి 14న తమ `నా సామి రంగ` మూవీని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ ఇచ్చారు. ఇందులో నాగార్జునతోపాటు అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లు కలిసి డాన్సు చేస్తున్న పోస్టర్‌ని విడుదల చేయగా ఆకట్టుకుంటుంది. పండగని తలపించేలా ఉన్న `నా సామి రంగ` సాంగ్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి విజయ్‌ బిన్ని దర్శకుడు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ మూవీ నిర్మితమవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

click me!