'హీరో' ఈ టైటిల్ ఎవరికోసం..?

Published : Aug 25, 2018, 06:15 PM ISTUpdated : Sep 09, 2018, 11:08 AM IST
'హీరో' ఈ టైటిల్ ఎవరికోసం..?

సారాంశం

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'మైత్రి మూవీ మేకర్స్' బ్యానర్ పై 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' ఇలా ఎన్నో హిట్ సినిమాలు రూపొందాయి

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'మైత్రి మూవీ మేకర్స్' బ్యానర్ పై 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' ఇలా ఎన్నో హిట్ సినిమాలు రూపొందాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ పై రవితేజ-శ్రీనువైట్ల సినిమాతో పాటు విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాను నిర్మిస్తున్నారు.

మహేష్ బాబు-సుకుమార్ సినిమా కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కనుంది. ఈ సినిమాలతో పాటు పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తాజాగా ఈ బ్యానర్ పై 'హీరో' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. గతంలో ఈ పేరుతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేశారు. కొన్నేళ్ల తరువాత నితిన్ తన సినిమాకు ఈ టైటిల్ ను వాడుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఈ టైటిల్ ను తమ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు మైత్రి నిర్మాతలు.

అయితే ఈ టైటిల్ ఎవరి కోసమా..? అనే చర్చలు మొదలయ్యాయి, మహేష్ బాబు సినిమా కోసమైతే ఈ టైటిల్ ని వాడే ఛాన్స్ లేదు. సాయి ధరమ్ తేజ్-కిషోర్ తిరుమల సినిమా కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారా..? అనుకుంటే ఈ సినిమాకు 'చిత్రలహరి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఈ 'హీరో' టైటిల్ ఏ హీరో కోసమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! 

PREV
click me!

Recommended Stories

Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?