''మై నేమ్ ఈజ్ ఆర్జీవీ'' సినిమా.. వర్మకి కౌంటరా..?

Published : Jan 16, 2019, 01:01 PM IST
''మై నేమ్ ఈజ్ ఆర్జీవీ'' సినిమా.. వర్మకి కౌంటరా..?

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ఎలాంటి పోస్ట్ పెట్టినా అది వార్తై కూర్చుంటుంది. అలాంటిది ఆయన పేరుతోనే సినిమా తీస్తున్నాడు ఓ దర్శకుడు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ఎలాంటి పోస్ట్ పెట్టినా అది వార్తై కూర్చుంటుంది. అలాంటిది ఆయన పేరుతోనే సినిమా తీస్తున్నాడు ఓ దర్శకుడు. ఆ సినిమాకి 'మై నేం ఈజ్ ఆర్జీవీ' అనే టైటిల్ కూడా పెట్టేశారు.

అయితే ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందా..? లేక ఆయన పేరును మాత్రమే వాడుకుంటున్నారా..? అనే విషయాల్లో స్పష్టత లేదు. తాజాగా ఈ సినిమా ప్రారంభమైంది.

గోపి జాన్వీ దర్శకత్వంలో నూతన నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయి వసంత్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Anirudh Ravichander: అనిరుధ్ క్యూట్ అండ్ యంగ్ లుక్ వెనుక సీక్రెట్.. ఆ 8 ఫుడ్స్ ఏంటో తెలుసా?
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?