తనీష్ కొత్త సినిమా.. 'సరిహద్దు'!

By Udayavani DhuliFirst Published Jan 16, 2019, 12:43 PM IST
Highlights

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలానే విలన్ గా కూడా ట్రై చేశాడు. కానీ ఒకట్రెండు తప్ప సరైన విజయాలను అందుకోలేకపోయాడు. 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలానే విలన్ గా కూడా ట్రై చేశాడు. కానీ ఒకట్రెండు తప్ప సరైన విజయాలను అందుకోలేకపోయాడు. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా వెళ్లిన తనీష్ ఫైనల్స్ వరకు షోలో ఉండి కాస్త పాపులారిటీ దక్కించుకున్నాడు.

రీసెంట్ గా అతడు నటించిన 'రంగు' సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను దర్శకుడు కార్తికేయ రూపొందించాడు. ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు తనీష్. అదే 'సరిహద్దు'.

ఈ సినిమా గురించి దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. ''భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని, ప్రతీ భాషకి ఒక 'తెగ' అని, కొన్ని తెగలకు ఒక 'కులం' అని, కొన్ని కులాలు కలిసి ఒక 'మతం' అని విడిపోతూ.. మృగాల నుండి మనుషులుగా, మనుషుల నుండి తెగలుగా, తెగల నుండి 'కులాలుగా', కులాల నుండి మతాలుగా, మతాల నుండి రాష్ట్రాలుగా, రాష్ట్రాల నుండి దేశాలుగా.. సరిహద్దులను గీసుకొంటూ బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తోనే 'సరిహద్దు' రూపొందబోతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. 

తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోన్న ఈ సినిమాను హై టెక్నికల్ వాల్యూస్ తో మార్చి నుండి షూటింగ్ జరపనున్నారు. ప్రముఖ తెలుగు, హిందీ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించనున్నారు. 

Wish you all a very happy sankranthi ❤️ pic.twitter.com/LgqOeuvULw

— Tanish Alladi (@IAmTanishAlladi)
click me!