Gowtam Tinnanuri Tweet : రామ్ చరణ్ తో సినిమా తీయాలన్నది నా డ్రీమ్.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి..

Published : Mar 17, 2022, 06:45 PM ISTUpdated : Mar 17, 2022, 06:50 PM IST
Gowtam Tinnanuri Tweet : రామ్ చరణ్ తో సినిమా తీయాలన్నది నా డ్రీమ్.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి..

సారాంశం

రెండు చిత్రాలతోనే తన ప్రభితను చాటుకున్న  యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutam Tinnanuri). అయితే తన నెక్ట్స్ ఫిల్మ్ రామ్ చరణ్ తో తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభ కలిన ఆర్టిస్టులకు, దర్శకులకు ఊహించని స్థాయిలో అవకాశాలు వచ్చి పడుతుంటాయి. ఎన్ని సినిమాలు తీశారు.. ఎంత ఎక్స్ పీరియెన్స్ ఉందన్నది ఎవరూ అడగటం లేదు. కథ పట్ల స్పష్టతనివ్వగలిగి.. స్టార్ యాక్టర్స్ లో నమ్మకం కలిగిస్తే చాలు.. ఊహించని స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. మరోవైపు యాక్టర్స్ కూడా అప్ కమింగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ కు అవకాశాలు ఇస్తున్నారు.  తన ప్రభతిభను నమ్ముకుని ‘జెర్సీ’లాంటి మూవీని అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అయితే ఆయన ఆర్సీ16పై నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు  ఆసక్తికర ట్వీట్ చేశాడు.  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ RRR మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’ కూడా రూపొందుతోంతి. ఆర్ఆర్ఆర్  షూటింగ్ ను పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. ఆర్సీ 15పైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టాడు.   ఆ తర్వాత రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ జెర్సీ (Jersey) మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తీయనున్నారు. ఈ విషయం ఇప్పటికి తెలిసిందే. అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం గౌతమ్ డైరెక్షన్ లో చరణ్ క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలంటూ రిక్వెస్ట్  లు పెడుతున్నారు. 

ఈ మేరకు రామ్ చరణ్ అభిమాని ఒకరు గౌతమ్ కు ట్విట్టర్ లో రెక్వెస్ట్ చేశారు. ‘అన్న మంచి సినిమా తీయు అన్న.. చరణ్ అన్న క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి’ అంటూ పేర్కొన్నాడు. ఇందుకు గౌతమ్ స్పందిస్తూ.. ‘నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. తల్చుకుంటే ఏదైనా సాధ్యమే.. పైగా రామ్ చరణ్ తో సినిమా తీయాలన్నది నా డ్రీమ్’ అని బదులిచ్చాడు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

 

యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో ఒకరైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. 2017లో డైరెక్టర్ గా అవతారం ఎత్తిన ఈ యంగ్ డైరెక్టర్ హీరో సుమంత్ తో కలిసి ‘మళ్లీ రావా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది పెద్ద సక్సెస్  కాకపోయినా.. తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన ప్రతిభను  నమ్ముకున్న గౌతమ్ నేచురల్ స్టార్ నాని (Nani)తో కలిసి ‘జెర్సీ’ మూవీని 2019లో ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చాడు. ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. ఎన్టీఆరే స్వయంగా.. ఈ మూవీలో నటించినందుకు నానిని ప్రశంసించాడు. అలాగే జెర్సీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు, నేషనల్  ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. గతేడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లలో బెస్ట్ తెలుగు డైరెక్టర్ గా గౌతమ్ గుర్తించబడ్డాడు. ఆ తర్వాత హిందీలో షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా