
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైపు ప్రస్తుతం సినీ రాజకీయ లోకం ఉత్కంఠగా చూస్తోంది. రాబోవు రోజుల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంగా అంత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పవన్ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయంగా ఇంకా ప్రభావం చూపలేదు. మరో ఏడాదిలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా సినిమాల పరంగా కూడా పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. మరో మూడు రోజుల్లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగబోతోంది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పవన్ నటుడిగా కూడా 27 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు విషెస్ తెలుపుతున్నారు.
పవన్ చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రమణ గోగుల ఒకరు. పవన్ 27 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా రమణ గోగుల స్పెషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ది 27 ఏళ్ల క్రియేటివ్ జర్నీ అని ప్రశంసించారు. నా బ్రదర్ పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెస్. సినిమాల్లో ఆయన తన బ్రిలియన్స్ చూపించారు. జనసేన పార్టీ 10 ఏళ్ల జర్నీకి కూడా నా విషెస్. నువ్వు బ్రిలియంట్ లీడర్ గా కొనసాగాలని కోరుకుంటున్నా అని రమణ గోగుల తెలిపారు.
పవన్, రమణ గోగుల కాంబోలో తమ్ముడు, బద్రి,జానీ, అన్నవరం లాంటి చిత్రాలు వచ్చాయి. పవన్ యూత్ ఐకాన్ గా మారడంలో రమణ గోగుల మ్యూజిక్ ప్రభావం కూడా ఎంతైనా ఉంది. మేడిన్ ఆంధ్ర స్టూడెంట్, ట్రావెలింగ్ సోల్జర్ లాంటి సాంగ్స్ కి యువతలో ఎలాంటి ఆదరణ లభించిందో అందరికీ తెలిసిందే.