సుశాంత్ ఆర్ధిక వ్యవహారలపై దృష్టి.. సీఏను నియమించిన ముంబై పోలీస్‌

By Satish ReddyFirst Published Aug 4, 2020, 5:13 PM IST
Highlights

సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ సుశాంత్ చార్టెడ్‌ అకౌంటెంట్‌ సందీప్‌ శ్రీధర్‌ ని ముంబైలో విచారించారు. ముఖ్యంగా సుశాంత్ అకౌంట్‌ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రియా, సుశాంత్ సంబంధించిన కోట్ల రూపాయాలను ఖర్చు చేసిందన్న ఆరోపణలు రావటంతో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా గత ఏడాది కాలంలో సుశాంత్ ఆర్దిక లావాదేవిలకు సంబంధించిన వ్యవహారాల లెక్క తేల్చేందుకు ముంబై పోలీసులు ప్రత్చేకంగా ఓ ఆడిటర్‌ను నియమించారు.

సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ సుశాంత్ చార్టెడ్‌ అకౌంటెంట్‌ సందీప్‌ శ్రీధర్‌ ని ముంబైలో విచారించారు. ముఖ్యంగా సుశాంత్ అకౌంట్‌ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈడీ సుశాంత్‌, రియా ఫ్యామిలీలు కలిసి నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవిల పై కూడా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ నిర్వహిస్తున్న వివిడ్రేజ్‌ రియాలటిక్స్‌, ఫ్రంట్‌ ఇండియా ఫర్ వరల్డ్‌ సంస్థల లావాదేవి మీద దృష్టిపెట్టారు.

ఈ రెండు కంపెనీల్లో ఒక కంపెనీకి రియా డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, మరో కంపెనీకి రియా తమ్ముడు షోవిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత వారం సుశాంత్ తండ్రి రియాపై పాట్నాలో కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రియా తన కొడుకును ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు పాలు చేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో ముంబై పోలీసులతో పాటు బీహార్‌ పోలీసులు కూడా ఈ వేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

click me!