Gehna sippy Tollywood Entry: తెలుగు తెరపై మెరవబోతున్న మరో ముంబయ్ భామ

Published : Jun 22, 2022, 01:32 PM ISTUpdated : Jun 22, 2022, 01:33 PM IST
Gehna sippy Tollywood Entry: తెలుగు తెరపై మెరవబోతున్న మరో ముంబయ్ భామ

సారాంశం

తెలుగు తెరపై ముంబయ్ హీరోయిన్ల హవా ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో.. చాలా మంది హీరోయిన్లు టాలీవడ్ తెరను ఏలారు. ఇప్పటికీ ఏలుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ముంబయ్ భామ టాలీవుడ్  ఎంట్రీ ఇవ్వబోతోంది.   

తెలుగు తెరపై ముంబయ్ హీరోయిన్ల హవా ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో.. చాలా మంది హీరోయిన్లు టాలీవడ్ తెరను ఏలారు. ఇప్పటికీ ఏలుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ముంబయ్ భామ టాలీవుడ్  ఎంట్రీ ఇవ్వబోతోంది. 

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో కొత్త నీరు భాగా వచ్చి చేరుతోంది. రీసెంట్ ఇయర్స్ లో ... టాలీవుడ్ కు కృతి శెట్టి,  శ్రీలీల, కేతిక శర్మ,ఇలా  వరుస గా కొత్త బామలు  అవకాశాలను అందుకుంటూ వెళుతున్నారు. ఇక  లైగర్  సినిమాతో అనన్య పాండే .. ఏజెంట్ తో సాక్షి వైద్య .. నాగశౌర్య సినిమాతో షిర్లే సెటియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు.

ఇక వీళ్లందరితో పాటు మరో ముంబై బ్యూటీ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ  బ్యూటీ పేరే గెహనా సిప్పీ. మోడలింగ్ నుంచి వచ్చిన గెహనా సిప్పీ చోర్ బజార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన థియేటర్లలో  సందడి చేయబోతోంది.  

జార్జి రెడ్డి సినిమాతో సంచలన సృష్టించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఖరీదైన ఓ వజ్రం చుట్టూ తిరుగుతుంది. యాక్షన్ తో పాటు కావలసినంత కామెడీ ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఈ సినిమాతో గెహనా సిప్పీ  టాలీవుడ్ స్క్రీన్ పై ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో .. ఎన్ని అవకాశాలను అందుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఇదేం ట్విస్ట్
Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ