దిక్కు తోచని స్థితిలో మల్టిఫ్లెక్స్ యాజమాన్యాలు.. అంబానీ దెబ్బతో షాక్!

By tirumala ANFirst Published Aug 13, 2019, 6:01 PM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. జియో సర్వీసులతో ఇప్పటికే టెలికమ్యూనికేషన్ లో ముకేశ్ అంబానీ సంచలనం సృష్టించారు. ఇటీవల అంబానీ మరో ప్రకటన చేశారు. త్వరలో జియో ఫైబర్ సర్వీసులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అంబానీ ప్రవేశపెట్టబోతున్న ఈ జియో ఫైబర్ సర్వీసులతో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లకు సినిమాలని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే వీక్షించే వెసులుబాటు కల్పించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో మల్టిఫ్లెక్స్ యాజమాన్యాలలో అలజడి మొదలైంది. ఈ ప్రకటన తర్వాత మల్టీఫ్లెక్స్ షేర్లు బాగా పడిపోయాయి. 

దీనితో వెంటనే పివిఆర్, ఐనాక్స్ లాంటి దిగ్గజ మల్టీఫ్లెక్స్ సంస్థలు స్పందించాయి. అంబానీ ప్రకటనని వ్యతిరేకిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశాయి. ప్రేక్షకుల థియేటర్స్ లోనే సినిమా చూడడం అనేది చాలా రోజులుగా వస్తున్న సాంప్రదాయం. దీని ద్వారా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎక్సిబిటర్లు లాభాలు అందుకుంటున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇదే పద్దతి కొనసాగుతోంది. సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత మాత్రమే ఇతర మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఈ పద్ధతిపై నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. సినిమాకు నిర్మాతే యజమాని. ఇండియాలో సినిమాని థియేటర్స్ లో 8 వారలు ప్రదర్శించిన తర్వాతే ఇతర మాధ్యమాల్లో విడుదల చేయాలనేది నిర్మాతల నిర్ణయం. 

అలా కాకుండా విడుదల రోజే ప్రేక్షకుడు ఇంట్లో కూర్చుని సినిమా చూసేలా అవకాశం కల్పించడం సరైన నిర్ణయం కాదు అని పివిఆర్, ఐనాక్స్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. మొత్తంగా అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంటర్టైన్మెంట్ రంగంలో పెద్ద కుదుపుకు కారణం అయ్యేలా ఉంది. 

click me!