సెన్సార్ టాక్: మిస్టర్ మజ్ను.. అఖిల్ సూపర్బ్!

Published : Jan 21, 2019, 06:48 PM IST
సెన్సార్ టాక్: మిస్టర్ మజ్ను.. అఖిల్ సూపర్బ్!

సారాంశం

రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో  నేడు సినిమాకు సంబందించిన  సెన్సార్ పనులను చిత్ర యూనిట్ ముగించుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. 

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం హిట్టు కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖిల్ - హలో సినిమాల రిజల్ట్ లా కాకుండా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీతో బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. 

ఇక రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో  నేడు సినిమాకు సంబందించిన సెన్సార్ పనులను చిత్ర యూనిట్ ముగించుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఫుల్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్ వస్తోంది. సినిమాలో అఖిల్ ప్లే బాయ్ గా అలరించాడని సెన్సార్ యూనిట్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 

ఇక రీసెంట్ గా ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా అఖిల్ నటనపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ సినిమా ద్వారా అఖిల్ స్టార్ హీరోగా క్లిక్ అవుతాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ -  సినిమాటోగ్రఫీ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినట్లు టాక్. BVSN ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 25న రిలీజ్ కానుంది.     

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?