దసరా బరిలో అక్కినేని అఖిల్... ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

By team teluguFirst Published Sep 29, 2021, 12:26 PM IST
Highlights

చాలా కాలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఓ దశలో ఓటిటి లో విడుదల చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. ఎట్టకేలకు మూవీ విడుదల తేదీ ప్రకటించారు. 

అక్కినేని యువ హీరో అఖిల్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచాలు ఏర్పరిచాయి. అక్కినేని హీరో ఈసారి సూపర్ హిట్ కొట్టనున్నాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. 
 

చాలా కాలంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఓ దశలో ఓటిటి లో విడుదల చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. ఎట్టకేలకు మూవీ విడుదల తేదీ ప్రకటించారు. అక్టోబర్ 15న విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 30న సాయంత్రం 06:10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. టాలీవుడ్ లక్కీ లేడీగా వరుస హిట్స్ అందుకుంటున్న పూజా హెగ్డే రోల్ పై ఆసక్తి నెలకొని ఉంది. అఖిల్, పూజా చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. 

In theatres from 15th October. See you soon everyone 🤗 pic.twitter.com/8HJMQoRjkk

— Akhil Akkineni (@AkhilAkkineni8)
click me!