యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులోకి మోహన్‌బాబు మనవరాలు..

Published : Dec 19, 2020, 03:16 PM IST
యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులోకి మోహన్‌బాబు మనవరాలు..

సారాంశం

నటుడు మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మీ కుతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌`గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. శనివారం నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన గేమ్‌లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ ని సొంతం చేసుకుంది.

నటుడు మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మీ కుతురు విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్‌ ట్రైనర్‌`గా నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్  రికార్డులోకి ఎక్కింది. శనివారం నొబెల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన గేమ్‌లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డా.చోకలింగం బాలాజీ మాట్లాడుతూ, ఆరేళ్ళ వయసులో చెస్‌ గేమ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వడం గొప్ప విషయం. మా సంస్థ తరఫున రికార్డ్ అందించినందుకు సంతోషంగా ఉందన్నారు.

డా. మోహ‌న్ బాబు మాట్లాడుతూ, `నాకు ఈ రోజుకి చెస్ ఆడ‌డం తెలీదు. అటువంటిది మా మ‌నవ‌రాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పిన‌ప్పుడు ఎందుక‌మ్మా ఇవ‌న్ని చ‌క్క‌గా చ‌దువుకోనివ్వు  అని అన్నాను. త‌ను ఈ వ‌య‌సులో ఈ రికార్డు లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాత‌గా ఎంతో గ‌ర్వంగా ఉంది.  త‌ల్లిదండ్రులకి నేను చెప్ప‌ద‌లుచుకుంది ఏంటంటే వారి పిల్ల‌ల‌కు దేనిమీద అయితే ఆస‌క్తి ఉందో చ‌దువుతోపాటు దానికి కొంత స‌మ‌యం కేటాయిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌తిఒక్క‌రు గొప్ప స్థాయికి చేరుకుంటారు. మా అంద‌రి బ్లెస్సింగ్స్‌తో గ్రేట్ నిర్వాణ కావాల‌ని కోరుకుంటున్నాను` అని అన్నారు.

మంచు ల‌క్ష్మి  చెబుతూ, చెస్ అనేది కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను న‌మ్ముతాను. అందుకే విధ్య కి చిన్న వ‌య‌సులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించ‌డం జ‌రిగింది. కానీ రెండు వారాల్లోనే త‌న కోచ్ కార్తిక్ గారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది. ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. త‌ను రెడీగా ఉన్న‌ప్పుడు మ‌నం ఎందుకు స‌పోర్ట్ చేయ‌కూడ‌దు అని ఓకే చెప్ప‌డం జ‌రిగింది. విధ్యా నిర్వాణ ఇంత చిన్న వ‌య‌సులోనే  `యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌` గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వపడుతున్నానని చెప్పింది. 

విధ్యా నిర్వాణ ట్రైన‌ర్ కార్తిక్ మాట్లాడుతూ, విధ్యా నిర్వాణ‌కి చెస్ గేమ్ నేర్పిస్తే త‌ప్ప‌కుండా రాణించ‌గ‌ల‌ద‌ని గ‌తేడాదే మంచు లక్ష్మిగారికి చెప్పాను.  ట్రైనింగ్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టాక నాలుగైదు క్లాసుల్లోనే ఎంతో చురుకుగా గేమ్‌ని పూర్తిగా నేర్చుకుంది. ఆ త‌ర్వాత త‌న ఫ్రెండ్స్‌కి చెస్‌గేమ్ నేర్పించ‌డం మొద‌లుపెట్టింది. అప్పుడే ఈ రికార్డ్ ఎందుకు న‌మోదు చేయ‌కూడ‌దు అనిపించి వారి ప్ర‌తినిధుల‌తో మాట్లాడి ఈ రికార్డ్‌ కోసం న‌మోదు చేయ‌డం జ‌రిగింది. ఈ రోజు నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సాధించ‌డం సంతోషంగా ఉంది` అని తెలిపారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌