
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఎవరు దోచుకోలేని సంపద చదువు అంటూ.. విద్యా ధాతగా మారారు. సొంత ఖర్చుతో పేదపిల్లలను చదివించడానికి ముందుకు వచ్చారు.
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఆడియన్స్ ను అలరించడమే కాదు.. తన మంచి మనసుతో మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇక ఈసారి కూడా ఓ మంచి పనితో ప్రేక్షకులు మనసు దొచుకున్నాడు మోహన్ లాల్. ఈ కంప్లీట్ యాక్టర్ తన పెద్ద మనసుతో ఉదారత చాటుకున్నారు. ఏకంగా 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు.
అది కూడా గిరిజన తెగకు చెందిన 20 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేసుకుని 15 ఏళ్ల పాటు వారి చదువుకయ్యే ఖర్చులను భరించనున్నారు మాలీవుడ్ స్టార్. ఈ విద్యకు అయ్యే ఖర్చును విశ్వశాంతి ఫౌండేషన్ కు చెందిన వింటేజ్ పతకం ద్వారా మోహన్ లాల్ ఖర్చు చేయనున్నారు. అంతే కాదు వారు ఏ కోర్సుల్లో చదువుకుంటాము అంటారో.. అదే కోర్సును చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్ ప్రకటించింది.
ఆప్రాజెక్ట్ ను పక్కా ప్రణాళికా బద్దంగా నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సెట్ చేశారు టీమ్. మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశామని మోహన్ లాల్ తెలిపారు. విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో వింటేజ్' ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేము అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్ క్యాంప్స్ ద్వారా సెలెక్ట్ చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్య, వనరులు అందిస్తాం అన్నారు మోహన్ లాల్.
అంతే కాదు ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు మోహన్ లాల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఇక ఈ పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాం. అంటూ ఫేస్‌బుక్ పేజీలో మోహన్ లాల్ పేర్కొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన మోహన్ లాల్ కు అటు మాలీవుడ్ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.