ఇక్కడ పవన్.. మళయాళ వెర్షన్ కు మోహన్ లాల్!

Published : Aug 18, 2019, 02:36 PM IST
ఇక్కడ  పవన్.. మళయాళ వెర్షన్ కు మోహన్ లాల్!

సారాంశం

రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి  టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.  సైరా లో చిరంజీవి క్యారక్టర్ అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.   మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, మెగా ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త. పైగా పవన్ సినిమాలు మానేసిన ఈ టైమ్ లో కనీసం తెరపై ఆయన వాయిస్ విని పవన్ ప్యాన్స్ ఆనందిస్తున్నారు. 

రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి  టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.  సైరా లో చిరంజీవి క్యారక్టర్ అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.   మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, మెగా ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త. పైగా పవన్ సినిమాలు మానేసిన ఈ టైమ్ లో కనీసం తెరపై ఆయన వాయిస్ విని పవన్ ప్యాన్స్ ఆనందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ...టీజర్ కు డబ్బింగ్ చెప్పినట్లే ..మళయాళ  వెర్షన్ సైరా టీజర్ కు మోహన్ లాల్ చేత వాయిస్ ఇప్పించారు. ఈ నెల 20న సైరా టీజర్ ని మళయాళంలోనూ విడుదల కానుంది.

అలాగే మోహన్ లాల్ ‘సైరా’ టీజర్ తో పాటు మూవీకి కూడా డబ్బింగ్ చెప్పారు. ఇక  సైరా టీమ్ మళయాళ వెర్షన్ ని సైతం  భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రమోషన్ ప్లాన్ లను రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిత్రం.. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార  హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి